Skip to main content

Geethanjali Sree: హిందీ నవలకు బుకర్‌ ప్రైజ్‌

గీతాంజలిశ్రీ ‘రేత్‌ సమాధి’కి అంతర్జాతీయ బుకర్‌ ప్రైజ్‌ పురస్కారం
Geetanjali Shree wins International Booker Prize
  • లండన్‌: హిందీ సాహిత్యానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భారతీయ రచయిత్రి గీతాంజలిశ్రీకి ప్రతిష్టాత్మకమైన బుకర్‌ ప్రైజ్‌ లభించింది. ఆమె రాసిన హిందీ నవల ‘రేత్‌ సమాధి’ (ఇసుక సమాధి) ఆంగ్ల అనువాదం ‘టూంబ్‌ ఆఫ్‌ శాండ్‌’కు ఈ పురస్కారం లభించింది.
  • Download Current Affairs PDFs Here
  • లండన్‌లో గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో గీతాంజలి బుకర్‌ ప్రైజ్‌ అందుకున్నారు. హిందీ మూల రచనకు బుకర్‌కు ప్రైజ్‌ రావడం ఇదే తొలిసారి. అవార్డు రావడం పట్ల సంభ్రమాశ్చర్యాలకు లోనైనట్టు 64 ఏళ్ల గీతాంజలి చెప్పారు.
    ​​​​​​​
    Daily Current Affairs in Telugu: 2022, మే 27 కరెంట్‌ అఫైర్స్‌ 
  • ‘‘బుకర్‌ పురస్కారం వస్తుందని ఊహించలేదు. ఇది అనితరసాధ్యమైన గుర్తింపు. నాకు ఎనలేని గౌరవం. చాలా ఆనందంగా ఉంది’’ అని తన ప్రసంగంలో చెప్పారు. ఘనమైన హిందీ సాహితీ సంపదకు ఈ పుస్తకం నిలువెత్తు నిదర్శమన్నారు. 50 వేల పౌండ్ల (దాదాపుగా రూ.49 లక్షలు) నగదు పురస్కారాన్ని నవలను ఆంగ్లంలోకి అనువదించిన రైజీ రాక్‌వెల్‌తో కలిసి ఆమె పంచుకుంటారు. 
     
Published date : 28 May 2022 03:16PM

Photo Stories