Skip to main content

ఏప్రిల్ 2018 అవార్డ్స్

యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ పురస్కారం 2018
Current Affairs నిర్భంధంలో ఉన్న ఈజిప్టు ఫొటో జర్నలిస్టు మెహముద్ అబు జైద్ అలియాస్ షౌకన్ కు యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ పురస్కారం దక్కింది. 2013లో కై రో రక్షణ దళానికి, ఇస్లామిస్ట్ అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలను కవర్ చేసినందుకుగాను షౌకన్‌ను అరెస్టు చేశారు. పత్రికా స్వేచ్ఛలో ప్రెస్ ఫ్రీడమ్ గ్రూప్ రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్(ఆర్‌ఎస్‌ఎఫ్) మొత్తం 180 దేశాలకు ర్యాంకులు ప్రకటించగా, ఈజిప్టు 161వ స్థానంలో నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ పురస్కారం 2018
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎవరు : మెహముద్ అబు జైద్ అలియాస్ షౌకన్
ఎక్కడ : ఈజిప్టు

అజహర్ మక్సూసీకి యుధ్‌వీర్ పురస్కారం
2018 సంవత్సరానికి ప్రతిష్టాత్మక యుధ్‌వీర్ ఫౌండేషన్ స్మారక పురస్కారం.. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ ఉస్మాన్ అజహర్ మక్సూసీకి దక్కింది. ఉచితంగా అన్నదానం చేస్తూ పేదల ఆకలి తీరుస్తున్నందుకు ఆయనకు ఈ పురస్కారం లభించింది.

65వ జాతీయ చలన చిత్ర అవార్డులు
Current Affairs
జాతీయ స్థాయిలో సినిమా రంగానికిచ్చే ‘జాతీయ చలన చిత్ర అవార్డుల’ను ఏప్రిల్ 13న ప్రకటించారు. ఈ అవార్డుల్లో బాహుబలి-2, ఘాజీ చిత్రాలు టాప్ అవార్డులను దక్కించుకున్నాయి. ఇటీవల మరణించిన నటి శ్రీదేవికి ఉత్తమ నటి అవార్డు రాగా, అస్సామీ చిత్రం విలేజ్ రాక్‌స్టార్స్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డుల జ్యూరీ కమిటీ అధ్యక్షుడు, బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ 65వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు. 2017లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులను ప్రకటించారు.

వరదరాజన్‌కు షోరెన్‌స్టెయిన్ అవార్డు
ప్రతిష్టాత్మక ‘షొరెన్‌స్టెయిన్’ జర్నలిజం అవార్డు-2017ను న్యూస్ వెబ్‌సైట్ ‘ద వైర్’ వ్యవస్థాపక ఎడిటర్ సిద్దార్థ్ వరదరాజన్ అందుకోనున్నాడు. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ఇచ్చే ఈ అవార్డును ఏప్రిల్ 16న రాజన్‌కి ప్రదానం చేస్తుంది. ఆసియా ప్రాంతంపై చేసిన రిపోర్టింగ్‌కు గాను వరదరాజన్‌కి ఈ పురస్కారం దక్కింది. ఢిల్లీకి చెందిన వరదరాజన్ గతంలో హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి జాతీయ పత్రికల్లో పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జర్నలిస్టు వరదరాజన్‌కు షోరెన్‌స్టెయిన్ అవార్డు
ఎప్పుడు : ఏప్రిల్ 16
ఎవరు : స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా
ఎందుకు : ఆసియా ప్రాంతంపై చేసిన రిపోర్టింగ్‌కు

కోహ్లీ, మిథాలీ కి విజ్డెన్’ పురస్కారం
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, మహిళల సారథి మిథాలీ రాజ్ లు ప్రఖ్యాత క్రికెట్ మేగజైన్ ‘విజ్డెన్’ పురస్కారాలకు ఎంపికయ్యారు. దీంతో సెహ్వగ్ (2008, 2009) తర్వాత ‘విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్’ పురస్కారాన్ని వరుసగా రెండుసార్లు అందుకున్న భారత క్రికెటర్‌గా కోహ్లీ (2017, 2018) నిలిచాడు. మహిళల క్రికెట్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు, పరుగులు చేసిన మిథాలీ ‘లీడింగ్ విమెన్ క్రికెటర్’గా నిలిచింది. అలాగే అఫ్గానిస్తాన్‌కి చెందిన రషీద్ ఖాన్ ‘ఫార్‌మోస్ట్ టి20 ప్లేయర్’ పురస్కారానికి ఎంపికయ్యాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ పురస్కారం
ఎప్పుడు : ఏప్రిల్ 11
ఎవరు : విరాట్ కోహ్లి, మిథాలీ రాజ్

పులిట్జర్ బహుమతులు 2018
అమెరికాలో జర్నలిజం, సాహిత్యం, సంగీతంలో ఇచ్చే అత్యున్నత అవార్డులు పులిట్జర్ ప్రైజ్‌లను ఏప్రిల్ 17న ప్రకటించారు. ఈ అవార్డుల్లో జర్నలిజం విభాగంలో ది న్యూయార్క్ టైమ్స్, ది న్యూయార్కర్ పత్రికలు సంయుక్తంగా ఎంపికయ్యాయి. తమ కథనాల ద్వారా హాలీవుడ్‌లో జరుగుతున్న లైంగిక వేధింపుల ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చినందుకు వీటికి ఈ పురస్కారం ప్రకటించినట్లు అవార్డుల కమిటీ పేర్కొంది.
సంగీత విభాగంలో 30 ఏళ్ల పాప్ గాయకుడు కెండ్రిక్ లామర్ రూపొందించిన ఆల్బమ్ ’డామ్న్’కు ఈ పురస్కారం దక్కింది. దీంతో పులిట్జర్ ప్రైజ్ పొందిన తొలి పాప్ గాయకుడిగా ఆయన రికార్డు సృష్టించారు.
సాహిత్యంలో అండ్రూ సీన్ గ్రీర్ రచించిన కాల్పనిక నవల ‘లెస్’కు పులిట్జర్‌ను సొంతం చేసుకున్నారు. లెటర్స్ అండ్ డ్రామా విభాగంలో కారోలిన్ ఫ్రేజర్ రాసిన ‘ఫైర్స్’అనే బయోగ్రఫీ, మార్టిన్ మజోక్ నాటకం ‘కాస్ట్ ఆఫ్ లివింగ్’ ఈ అవార్డుకు ఎంపికయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పులిట్జర్ బహుమతులు 2018
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : ది న్యూయార్క్ టైమ్స్, ది న్యూయార్కర్ పత్రికలు
ఎందుకు : హాలీవుడ్‌లో జరుగుతున్న లైంగిక వేధింపుల ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చినందుకు

ముగ్గురు భారతీయులకు ఐషో పురస్కారాలు
భారత్‌కు చెందిన ముగ్గురు ఆవిష్కర్తలు దావ్లే (థింకర్ బెల్ ల్యాబ్స్, బెంగళూరు), బాలాజీ తీగల(బ్రున్ హెల్త్, న్యూఢిల్లీ), వినాయక్ నందాలికే (యోస్త్రా ల్యాబ్స్, బెంగళూరు) అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్(ఏఎస్‌ఎంఈ) ఇన్నోవేషన్ షోకేస్ అవార్డులకు ఎంపికయ్యారు. ఆర్థిక, సాంకేతిక విభాగాల్లో నూతన ఆవిష్కరణలను ఆహ్వానిస్తూ ఏఎస్‌ఎంఈ 2018 సంవత్సరానికి ఈ పురస్కారాలను ప్రకటించింది.
దావ్లే ఆడియో టాక్టిల్ డివైజ్‌ను రూపొందించారు. దీనిపై రాసే బ్రెయిలీ లిపిని ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకోవడంతో పాటు దీనిలో డిజిటల్ బ్రెయిలీ పలక, బ్రెయిలీ కీబోర్డు వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. బాలాజీ నవజాత శిశు మరణాల రేటు తగ్గించే లేబర్ డిటెక్షన్ టూల్‌ను రూపొందించగా, వినాయక్ ఫోర్టబుల్ మెడికల్ పరికరాన్ని తయారు చేశారు. ఇది మధుమేహ రోగులలో వచ్చే నరాల వ్యాధిని, దాని లక్షణాల ద్వారా ముందే పసిగడుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ముగ్గురు భారతీయులకు ఐషో పురస్కారాలు
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : దావ్లే, బాలాజీ తీగల, వినాయక్ నందాలికే

దక్షిణ మధ్య రైల్వే జీఎంకు పురస్కారం
ఉత్తమ పనితీరు కనబరిచినందుకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ బెస్ట్ ట్రాన్స్ఫార్మేషన్ ఇనీషియేటివ్ పురస్కారానికి ఎంపికయ్యారు. జోన్‌ను ఉత్తమంగా నిలిపేందుకు ఆయన చేసిన వినూత్న కార్యక్రమాలను, పనితీరును గుర్తించి రైల్వే మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 6న ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దక్షిణ మధ్య రైల్వే జీఎంకు బెస్ట్ ట్రాన్స్ఫార్మేషన్ ఇనీషియేటివ్ అవార్డు
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : వినోద్ కుమార్ యాదవ్
ఎందుకు : రైల్వే జోన్‌ను ఉత్తమంగా నిలిపినందుకు

అనుష్క, రణ్‌వీర్‌లకు ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డు
బాలీవుడ్ నటి, నిర్మాత అనుష్కశర్మ, నటుడు రణ్‌వీర్ సింగ్ దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. మంచి కథలతో సినిమాల నిర్మాణానికి చొరవ చూపుతున్నందుకు గుర్తింపుగా అనుష్క, పద్మావతి చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీగా అద్భుత నటనను కనబర్చినందుకు రణ్‌వీర్ కు ఈ అవార్డు అందజేయాలని నిర్ణయించినట్లు దాదాసాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ తెలిపింది. తన సోదరుడు కర్ణేశ్ శర్మతో కలిసి నిర్మాణ సంస్థను ప్రారంభించిన అనుష్క ‘ఎన్‌హెచ్ 10’ అనే చిత్రాన్ని నిర్మించింది. దీంతో 25 ఏళ్ల వయసులోనే యంగెస్ట్ ప్రొడ్యూసర్‌గా అనుష్క గుర్తింపు పొందింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డు
ఎప్పుడు : ఏప్రిల్ 8
ఎవరు : అనుష్క శర్మ, రణ్‌వీర్‌సింగ్
ఎందుకు : మంచి కథలతో సినిమాలు నిర్మిస్తున్నందుకు, పద్మావతి చిత్రంలో అద్భుత నటన కనబర్చినందుకు
Published date : 16 May 2018 03:41PM

Photo Stories