UN Peace Medal : ఐక్యరాజ్య సమితి శాంతి పతకం పొందిన మహిళ?
తెలంగాణ పోలీసు విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా (డీఎస్పీ) విధులు నిర్వర్తిస్తున్న పెద్దారెడ్డి సీతారెడ్డి తెలంగాణ రాష్ట్రం తరఫున ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో పని చేస్తున్నారు. 2021, ఏడాది దక్షిణ భారత దేశం నుంచి ఎంపికైన వారిలో సీతారెడ్డి మాత్రమే ఏకైక మహిళ. ఈమెకు ఐక్యరాజ్య సమితి (యూఎన్) అక్టోబర్ 22న (భారత కాలమాన ప్రకారం) పీస్ మెడల్(శాంతి పతకం), సర్టిఫికెట్ ప్రదానం చేసింది. హైదరాబాద్కు చెందిన సీతారెడ్డి... 1996లో సబ్–ఇన్స్పెక్టర్గా చేరి... డీఎస్పీ స్థాయికి చేరారు. తెలంగాణ రాష్ట్ర నేర పరిశోధన విభాగంలో (సీఐడీ) డీఎస్పీ గా పని చేస్తుండగా ఐరాస శాంతి పరిరక్షక దళంలో పని చేయడానికి ఎంపికయ్యారు. ఐరాస శాంతి పరిరక్షక దళంలోకి సీతారెడ్డి ఎంపిక కావడం ఇది రెండోసారి.
చదవండి: క్లారివేట్ అవార్డును అందుకున్న ప్రభుత్వ రంగ సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐక్యరాజ్య సమితి శాంతి పతకం పొందిన మహిళ?
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : తెలంగాణ పోలీసు విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న పెద్దారెడ్డి సీతారెడ్డి
ఎందుకు : ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...