Bapu Award: కార్టూనిస్ట్ శంకర్‌కు బాపూ పురస్కారం
Sakshi Education
హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో బాపూరమణ అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ 15న బాపూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రముఖ కార్టూనిస్ట్ పామర్తి శంకర్‌కు బాపూ పురస్కారం, రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మికి రమణ పురస్కారాలను ప్రదానం చేశారు. అదేవిధంగా ముళ్లపూడి వెంకటరమణ రచించిన కథా పుస్తకాలు, కార్టూనిస్ట్ రామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన కార్టూన్ల సంకలనాలను ఆవిష్కరించారు. బాపూ చిత్రాలు అపురూపమైనవని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు.
Eco Oscar: తెలంగాణ స్టార్టప్‌కు ఎకో ఆస్కార్
Published date : 16 Dec 2022 01:29PM