Oscar Awards 2022: ఫైనల్ జాబితాలో నిలిచిన 10 విభాగాలు ఇవే..
ఈసారి నిర్వహించే 94వ అకాడమీ అవార్డులను ఫిబ్రవరి 1, 2022న ప్రకటించనున్నారు. అయితే ఈ అవార్డుల కోసం 10 విభాగాల వరకు కుదించారు. ఈ షార్ట్ లిస్ట్ చేసిన తుది జాబితాను ప్రకటించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఈ తుది జాబితా ఎంపికైన చిత్రాలకు జనవరి 27, 2022 (గురువారం) నుంచి ఫిబ్రవరి 1, 2022 (మంగళవారం) వరకు ఓటింగ్ నిర్వహిస్తారు.
1. ఉత్తమ డాక్యుమెంటరీ (ఫీచర్) :
94వ అకాడమీ అవార్డుల కోసం ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో 15 సినిమాలు తుది జాబితాలో ఉన్నాయి. ఈ కేటగిరీలో 138 సినిమాలు అర్హత సాధించాయి. ఈ షార్ట్ లిస్ట్, నామినీలను డాక్యుమెంటరీకి సంబంధించిన బ్రాంచ్ సభ్యులు నిర్ణయిస్తారు.
2. ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్) :
ఈ కేటగిరీలో మొత్తం 82 సినిమాలు అర్హత సాధించగా.. 15 చిత్రాలు తుది జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
3. ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ :
ఈ ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 92 దేశాలకు చెందిన సినిమాలు అర్హత సాధించాయి. అందులో భారతదేశం నుంచి ఎంపికైన హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ కలిసి నిర్మించిన కూళాంగల్ (అంతర్జాతీయంగా సినిమా పేరు 'పెబుల్స్') ఒకటి. తుదిజాబితాకు 15 సినిమాలు వెళ్లగా.. అందులో కూళాంగల్‌కు స్థానం దక్కలేదు. ఈ షార్ట్ లిస్ట్ చేసిన సినిమాలు చూశాక ఓటింగ్ నిర్వహిస్తారు.
4. మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ :
ఈ విభాగంలో 10 సినిమాలు తుదిజాబితాలో స్థానం సంపాదించాయి. అకాడమీ మేకప్ ఆర్టిస్ట్స్, హెయిర్ స్టైలిస్ట్‌ల బ్రాంచ్‌లోని సభ్యులందరూ జనవరి 30, 2022 ఆదివారం షార్ట్ లిస్ట్ చేసిన ప్రతి సినిమాను వీక్షించి నిర్ణయం తీసుకుంటారు. తర్వాత చివరి ఐదు చిత్రాలను నామినేట్ చేయడానికి బ్రాంచ్ సభ్యులు ఓటు వేస్తారు.
5. మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్) :
ఇందులో 136 ఒరిజినల్ స్కోర్‌లు అర్హత సాధిచగా 15 షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఈ విభాగంలో కూడా బ్రాంచ్ సభ్యులు ఓటు వేస్తారు.
6. మ్యూజిక్ (ఒరిజినల్ సాంగ్) :
ఇందులో 84 పాటలు అర్హత సాధించగా 15 పాటలు తుది జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
7. ఉత్తమ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్ :
ఈ కేటగిరీలో 82 సినిమాలకు 15 చిత్రాలు తుది జాబితాకు వెళ్లాయి.
8. ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్‌ఫిల్మ్ :
ఈ ఉత్త లైవ్ యాక్షన్ షార్ట్‌ఫిల్మ్ విభాగంలో 145 సినిమాలు అర్హత సాధించగా.. 15 చిత్రాలు షార్ట్ లిస్ట్‌లోకి వెళ్లాయి. షార్ట్ ఫిల్మ్స్, ఫీచర్ యానిమేషన్ సభ్యులు, దర్శకులు, నిర్మాతలు, రచయితల శాఖల సభ్యులు షార్ట్‌లిస్ట్, నామినీలను నిర్ణయించడానికి ఓటు వేస్తారు.
9. సౌండ్ :
ఈ విభాగంలో 94వ అకాడమీ అవార్డుల కోసం 10 సినిమాలు ఫైనల్ లిస్ట్‌లో ఉన్నాయి. ఈ జాబితాలోని చిత్రాలను బ్రాంచ్ సభ్యులు జనవరి 28, 2022 శుక్రవారం వీక్షించి చివరిగా 5 సినిమాలను నామినేట్ చేసేందుకు ఓటు వేస్తారు.
10. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ :
ఈ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో 10 చిత్రాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. విజువల్ ఎఫెక్ట్స్ బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ షార్ట్‌లిస్ట్‌ను నిర్ణయించింది. విజువల్ ఎఫెక్ట్స్ బ్రాంచ్‌లోని సభ్యులందరూ జనవరి 29, 2022 శనివారం నాడు షార్ట్‌లిస్ట్ చేయబడిన ప్రతి సినిమా నుంచి 10 నిమిషాల సారాంశాన్ని వీక్షిస్తారు. అనంతరం ఆస్కార్ నామినేషన్‌కు 5 సినిమాలను ఎంపిక చేసేందుకు ఓటు వేస్తారు.