విశిష్ట విజయాల వశిష్ఠ
Sakshi Education
ఇండోనేషియాలో త్వరలో జరిగే అంతర్జాతీయ బయాలజీ ఒలింపియాడ్-2014 కోసం మనదేశం నుంచి నలభై వేల మంది విద్యార్థులు పోటీపడగా... చివరికి నలుగురికే ప్రాతినిథ్యం వహించే అవకాశం లభించింది. అందులో ఒకే ఒక్క తెలుగు తేజం 17 ఏళ్ల పోలిశెట్టి వశిష్ఠ.. అతని ప్రతిభకు ఇది ఓ నిదర్శనం.. అలాని దానికే పరిమితం కాలేదు. ఏ ప్రవేశ పరీక్ష నిర్వహించినా మొదటి వరుసలో ఉండడం అలవాటుగా మారింది.. ఇదే క్రమంలో ఇటీవల వెల్లడించిన ఎయిమ్స్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్ సాధించిన వశిష్ఠ.. సక్సెస్ స్టోరీ...
మా స్వస్థలం విజయనగరం జిల్లా పార్వతీపురం. వ్యాపార నిమిత్తం హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. నాన్న పోలిశెట్టి విశ్వనాథం. సివిల్ ఇంజనీర్. అమ్మ గాయత్రీదేవి. హిందీ, సంస్కృతం, తెలుగు భాషల్లో హోమ్ ట్యూటర్, సామాజిక కార్యకర్త. అక్క మనోజ్ఞ జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో బీఆర్క్ చేస్తోంది.
చదువు ఒకే చోట సాగలేదు:
నాన్న వ్యాపారాల రీత్యా నా చదువు ఒకేచోట సాగలేదు. దాంతో వివిధ నగరాల్లో చదవాల్సి వచ్చింది. చెన్నై, గుజరాత్‌లో ప్రాథమిక విద్య, ఆరో తరగతి ముంబైలో చదివాను. ఏడు నుంచి ఇంటర్మీడియెట్ వరకు హైదరాబాద్‌లో పూర్తిచేశాను.
ఎయిమ్స్ ఎందుకు?
వాస్తవంగా నేను ఇంటర్‌లో మొదట ఎంపీసీలో చేరాను. అయితే ఇంజనీరింగ్ అనంతరం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడిపోవడం ఇష్టం లేదు. పరిశోధనలతో నాకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని భావించాను. అందుకు మెడిసిన్ సరైన మార్గంగా తోచింది. దాంతో రెండు నెలల తర్వాత ఎంపీసీ నుంచి బైపీసీలోకి మారాను. వైద్య విద్యలో దేశంలోనే అత్యున్నత ఇన్‌స్టిట్యూట్ అయిన.. ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేస్తే నా లక్ష్యాన్ని చేరుకోవచ్చని భావించాను. అందుకే ఎయిమ్స్ ప్రవేశ పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నా. ఎయిమ్స్‌లో రెండో ర్యాంక్ వస్తుందనుకోలేదు. సీటు సంపాదిస్తాననే నమ్మకంతో ఇష్టంగా చదివాను. క్లిష్టంగా ఉన్న అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేశాను.
అన్నిట్లో ముందే:
దాదాపుగా అన్ని వైద్య విద్య ప్రవేశ పరీక్షలకు హాజరయ్యాను. జిప్‌మెర్‌లో రెండో ర్యాంక్, ఏఐపీఎమ్‌టీలో మూడో ర్యాంక్, మణిపాల్ ఎంట్రన్స్‌టెస్ట్‌లో తొమ్మిదో ర్యాంక్ వచ్చింది. ఎంసెట్ కూడా రాశాను. 67వ ర్యాంక్ వచ్చింది. కొన్ని తప్పిదాల వల్ల 3,4 మార్కులను చేజార్చుకున్నా. లేకుంటే ఎంసెట్‌లో టాప్-10లో ఉండే వాణ్ని.
ప్రిపరేషన్:
ఇంటర్‌తోపాటే పోటీపరీక్షలకు ప్రిపరేషన్ కొనసాగించా. చదివేటప్పుడు ప్రతీ అంశాన్ని అన్వయించుకుంటూ చదివాను. అలా చదవడం వల్ల ఎంసెట్, ఎయిమ్స్‌కు ఉపయోగపడింది. ఎంసెట్ ప్రిపరేషన్ కూడా ఎయిమ్స్‌లో ర్యాంక్ రావడానికి దోహదం చేసింది. ఎందుకంటే రెండిటి సిలబస్ దాదాపు ఒక్కటే. ఎంసెట్‌లో క్లిష్టంగా ఉన్న అంశాలపై దృష్టి పెట్టి విశ్లేషణాత్మకంగా చదివాను. ఎంసెట్‌లో బయాలజీ కొంచెం క్లిష్టంగా ఉంటుంది. ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రం సులభంగానే ఉంటుంది. ఎయిమ్స్ పరీక్ష విషయానికి వస్తే దీనికి పూర్తి భిన్నం. కానీ ఈ ఏడాది మాత్రం కొంచెం తేలికగానే పేపర్ వచ్చింది. ఎంసెట్ అనంతరం ఎయిమ్స్ రాయడానికి వారం రోజులు మాత్రమే సమయం ఉంది. ఆ స్వల్ప వ్యవధిలో క్లిష్టంగా ఉన్న అంశాలపై దృష్టి పెట్టి విశ్లేషణాత్మకంగా చదివాను. ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన సబ్జెక్ట్ పుస్తకాలు, తెలుగు అకాడ మీ పుస్తకాలను చదివాను.
క్విజ్‌పోటీల్లో పాల్గొనడం ఇష్టం:
చిన్నప్పట్నుంచి ఎక్కడ క్విజ్ పోటీలు జరిగినా పాల్గొనడం ఇష్టం. రాష్ట్ర, జిల్లా స్థాయిలో జరిగిన 12 పోటీల్లో పాల్గొని విజేత గా నిలిచాను. దీంతో ప్రతీ ఎంట్రన్స్‌ను క్విజ్‌పోటీలో అడిగే ప్రశ్నల్లా భావించా.
సేవలోనూ:
పదో తరగతిలో ఉన్నప్పుడు నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్షలో నైపుణ్యం చూపడంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏటా రూ. 6వేల స్కాలర్‌షిప్ అందుకుంటున్నాను. దీనికి మరో రూ. 4వేలను కలిపి మొత్తం రూ. 10 వేలను ఏటా పార్వతీపురంలోని ఆశాజ్యోతి అనాథ ఆశ్రమానికి విరాళంగా అందిస్తున్నాను.
ఒలింపియాడ్ ఎందుకు వదులుకున్నారు?
ఇండోనేషియాలో జూలై మొదటి వారంలో జరిగే బయాలజీ ఒలింపియాడ్-2014లో పాల్గొనే అవకాశం లభించింది. కానీ అదే సమయానికి ఇక్కడ ఎయిమ్స్ అడ్మిషన్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దాంతో ఒలింపియాడ్ పాల్గొనలేకపోతున్నాను
మీ ముందున్న లక్ష్యం:
ఎయిమ్స్-న్యూఢిల్లీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేస్తా. అయితే అభిరుచులు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కోర్సు పూర్తయ్యే సమయంలో నాకు ఏమనిపిస్తే ఆ అంశంలో పరిశోధనలు సాగించే దిశగా అడుగులు వేస్తా. మొత్తానికి పరిశోధకుడిగా రాణించాలన్నదే నా ఆశయం.
అకడెమిక్ ప్రొఫైల్

- 2012లో పదో తరగతి ఉత్తీర్ణత (676/700 మార్కులు, ఐసీఎస్‌ఈ)
- 2014లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత (979 మార్కులు)
- 2014 ఇంటర్నేషనల్ బయాలజీ ఒలింపియాడ్‌కు ఎంపిక.
Published date : 04 Jul 2014 04:33PM