సీఏ స్టేట్ టాపర్ విజయ రహస్యం
Sakshi Education
చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ).. విజయావకాశాలు తక్కువగా ఉండే కోర్సు! అందుకే దీని పట్ల విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నా చేరేందుకు ధైర్యం చూపేవారు తక్కువ. కానీ, పటిష్ట ప్రణాళికతో, లక్ష్యాన్ని చేరుకోవాలనే తపనతో చదివితే సీఏ కోర్సు పెద్ద కష్ట మేమీ కాదంటున్నాడు తిరుమలశెట్టి పవన్ కుమార్. ఇటీవల వెలువడిన సీఏ ఫైనల్ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 22వ ర్యాంకు సాధించిన (తెలుగు రాష్ట్రాల్లో టాపర్) పవన్ సక్సెస్ స్పీక్స్...
మాది గుంటూరు సమీపంలోని తుర్కపాలెం. నాన్న.. తిరుమలశెట్టి శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్‌లో నాలుగో తరగతి ఉద్యోగి(సెక్యూరిటీ గార్డు). అమ్మ.. రమాదేవి. గృహిణి. అన్న.. వెంకటేష్. ఎంబీఏ చదువుతున్నాడు. నేను పదో తరగతి వరకు కేంద్రీయ విద్యాలయంలో చదివాను. పదో తరగతిలో ఉన్నప్పుడు ఫిజికల్ సైన్‌స ఉపాధ్యాయుడు మూర్తి ఇచ్చిన సలహాతో సీఏ చదవాలని నిర్ణయించుకున్నా. 21 ఏళ్లకే దూరవిద్యలో పట్టా, సీఏ కోర్సు పూర్తి చేసే వీలు, ఆకర్షణీయమైన వేతనంతో కొలువులు దక్కించుకునే అవకాశం ఉన్నట్లు తెలియడంతో సీఏ చేయాలనుకున్నా. ఇంట్లో వారితో చెబితే వారు నా ఇష్టానికే ఓటేశారు. దీంతో పదో తరగతి తర్వాత మాస్టర్ మైండ్స్‌లో ఎంఈసీ గ్రూపులో చేరాను. సీఏ కోచింగ్ కూడా ఇక్కడే తీసుకున్నాను.
ఇంటర్‌లో స్టేట్ పదో ర్యాంకు :
ఇంటర్(ఎంఈసీ)లో 971 మార్కులు వచ్చాయి. నాది స్టేట్‌లో పదో ర్యాంకు. దీంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. సీఏను విజయవంతంగా పూర్తి చేయగలననే నమ్మకం ఏర్పడింది. రెట్టించిన ఉత్సాహంతో సీఏ సీపీటీ కోర్సు, సీఏ ఐపీసీసీ కోర్సులు పూర్తి చేశాను.
ప్రిపరేషన్ ఇలా..
సీఏ ఫైనల్ పరీక్షకు ఏడాది ముందు నుంచే సీరియస్‌గా సన్నద్ధత ప్రారంభించాను. 2016, మేలో కోచింగ్‌లో జాయిన్ అయ్యాను. నాలుగు నెలల్లో కోచింగ్ పూర్తయింది. డిసెంబర్ నుంచి రోజుకు 13-14 గంటలు శ్రమించాను. ఈ ఏడాది మేలో పరీక్ష రాశాను. ఇది మొదటి ప్రయత్నమే. ఉత్తీర్ణత సాధిస్తానని అనుకున్నా కానీ, 22వ ర్యాంకు(తెలుగు రాష్ట్రాల్లో టాపర్) వస్తుందని ఊహించలేదు. కోచింగ్.. ప్రిపరేషన్‌కు చాలా ఉపయోగపడింది. సీఏకు కోచింగ్ తప్పనిసరా? అని అడిగితే గెడైన్స్ కోసం తీసుకోవచ్చని సూచిస్తా. ఇక విద్యార్థులు ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఇచ్చే ప్రాక్టీస్ మాన్యువల్స్‌ను వీలైనన్ని సార్లు సాధన చేసి, పరీక్షకు హాజరవ్వాలి. వీటికి తోడు ఇన్‌స్టిట్యూట్స్ ఇచ్చే నోట్స్ అత్యంత కీలకం. ఐసీఏఐ అందించే స్టడీ మెటీరియల్‌ను నిర్లక్ష్యం చేయకూడదు.
తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నా..
సీఏ ఫైనల్ ప్రిపరేషనల్‌లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. సిలబస్ ఎక్కువగా ఉండటం, ఎంత చదువుతున్నా తరగడం లేదనే ఆందోళనతో ఒత్తిడికి గురయ్యాను. ఒకానొక దశలో ఎందుకు చేరానా అని అనుకున్నా. అలాంటి సందర్భాల్లో ఒకరోజు పాటు చదవడం ఆపేసేవాడిని. ఇంట్లో వారు ధైర్యం చెప్పేవారు. వారు ఇచ్చిన భరోసాతో ప్రిపరేషన్‌లో ముందడుగు వేశాను. క్రికెట్ ఆడటం, సంగీతం వినడం లాంటి పనులతో కాసింత ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం కూడా చేశా. సీఏలో చేరే విద్యార్థులు సిలబస్, పరీక్ష విధానం పూర్తిగా తెలుసుకొని కోర్సులో చేరడం మేలు. కెరీర్ ఆకర్షణీయంగా ఉన్నా కోర్సు క్లిష్టత స్థాయిని అర్థం చేసుకోవాలి. కోర్సు పూర్తిచేయడానికి చెమటోడ్చాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తెరిగి నిర్ణయం తీసుకోవాలి. అన్నింటి కంటే ముఖ్యంగా కుటుంబం మద్దతు లేకపోతే సీఏ సాధించడం కష్టమవుతుంది.
సోషల్ మీడియా.. తాజా సమాచారం కోసమే..
ప్రిపరేషన్ సమయంలో టెక్నాలజీకి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఎంత వరకు ఉపయోగమో ఆ మేరకే వాడుకోవాలి. సోషల్ మీడియాను కేవలం ఎడ్యుకేషన్ సంబంధిత సమాచారం కోసమే ఉపయోగించుకోవాలి. సీఏ సంబంధిత ఫేస్‌బుక్ పేజీల ద్వారా సదరు రంగంలో జరుగుతున్న తాజా పరిణామాలను తెలుసుకునేందుకు వీలుంటుంది.
ఉద్యోగంలో చేరతా..
ప్రసుత్తం ఉద్యోగంలో చేరడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నాను. ఆగస్టు 20 నుంచి క్యాంపస్ ఇంటర్య్యూలు ఉన్నాయి. ఏదైనా మంచి కంపెనీలో ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉంది. ప్రభుత్వ శాఖల్లో అవకాశాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నాను. నా వయసు 21 ఏళ్లే కాబట్టి కొంత పని అనుభవం తర్వాత సివిల్స్‌కు ప్రిపరేషన్ ప్రారంభించాలనే ఆలోచన కూడా ఉంది.

Published date : 15 Aug 2017 12:08PM