Skip to main content

రోజుకు 12 గంటలు చదివా - సాక్షితో గ్రూప్‌1 సెకండ్‌ ర్యాంకర్‌ శ్రీనివాస్‌


మాది శ్రీకాకుళం జిల్లా. శుక్రవారం ప్రకటించిన గ్రూప్‌1 స్టేట్‌ సెకండ్‌ ర్యాంకర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. ఫలితాల్లో రోజుకు 12 గంటలపాటు గ్రూప్‌1కు ప్రిపేరయ్యాను. ఎక్కడా కోచింగ్‌కు వెళ్లకుండానే సొంతంగా చదువుకున్నా. పేపర్‌4, 5లకు కోచింగ్‌సెంటర్‌ మెటీరియల్‌, ఓన్‌ నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవడం వల్ల ఎక్కువ స్కోరింగ్‌ సాధించగలిగాను.
సివిల్స్‌రాసి ఐఏఎస్‌ అధికారి కావాలనుకున్నా. అప్పటికే నేను శ్రీకాకుళం కలెక్టరరేట్‌లో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తుండడం వలన కుదరలేదు. దాంతో గ్రూప్‌ 1 పరీక్ష దగ్గరపడగానే ఉద్యోగానికి ఆరు నెలల సెలవుపెట్టి గట్టిగా చదివాను. నా కష్టం ఫలించింది. మొత్తం గ్రూప్‌1 మెయిన్స్‌, ఇంటర్వ్యూలో కలిపి 566 మార్కులు వచ్చాయి. రాష్ట్రంలో సెకండ్‌ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. ఎంఎస్సీ చదివిన నేను డిగ్రీ, బీఈడీ అంతా దూరవిద్యా విధానంలోనే చదివాను. 2009లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యాను. చిన్నప్పటినుంచి అయ్యేఎస్‌ కావాలనుకున్నా. ఆ కల ఎప్పటికైనా నెరవేర్చుకుంటా.

 

గ్రూప్‌1 ఇంటర్వ్యూలో నన్ను అడిగిన ప్రశ్నలు...
గ్రూప్‌1 ఇంటర్వ్యూ నాటికే నేను డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తుండడంతో వత్తికి సంబంధించిన ప్రశ్నలతోపాటు జీకేకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా
రాష్ట్ర ఎకై ్సజ్‌ పాలసీ గురించి చెప్పండి?
డిప్యూటీ తహసీల్దార్‌వి అయితే భూసేకరణ ఎలా చేస్తారు?
దేశంలో ఈశాన్యరాష్ట్రాలు ఎందుకు వెనుకబడ్డాయి?
తెలంగాణ, ఆంధ్రలో ప్రత్యేక రెవెన్యూ చట్టాలు ఉండడానికి కారణం?
జనవరి 26 ప్రాధాన్యత?
ఎన్నో రిపబ్లిక్‌ దినోత్సవం జరుగుతోందిప్పుడు?
పురుషులకన్నా మహిళలే ఆర్డీవోలుగా రాణిస్తారని అనుకుంటున్నాం. మీ అభిప్రాయం?
ఏజెన్సీలో విష జ్వరాలు ఇప్పటికీ ప్రబలుతుండడానికి కారణం?
సెల్ప్‌హెల్ప్‌ గ్రూపులు అంటే?

Published date : 13 Feb 2012 09:08PM

Photo Stories