ప్రణాళికగా చదివితే విజయోస్తు.. ఎడ్‌సెట్-2013 ఇంగ్లిష్ స్టేట్‌ఫస్ట్ ర్యాంకర్
Sakshi Education
ఇంగ్లిష్.. గ్లోబలైజేషన్ ప్రభావంతో విశ్వవ్యాప్తమైన భాష. భావవ్యక్తీకరణలో హవా అంతా ఇప్పుడు ఆంగ్లందే! సబ్జెక్టుపై పట్టు ఉన్నా.. ఇంగ్లిష్‌లో మాట్లాడే నైపుణ్యం లేక గ్రామీణ విద్యార్థులు వెనుకబడుతున్నారు. అందుకే పల్లెప్రాంత విద్యార్థులకు ఆలంబనగా నిలిచేందుకు తాను అధ్యాపకవృత్తిని ఎంచుకున్నట్లు చెబుతున్నారు ఎడ్‌సెట్-2013 ఇంగ్లిషు విభాగంలో 113 మార్కులతో రాష్టస్థ్రాయిలో మొదటిర్యాంకు సాధించిన బి.వి.ఎస్.ప్రసాద్. ముఖ్యంగా సాక్షి భవిత పోటీపరీక్షలకు అక్షర అస్త్రం, భవితను ప్రతి వారం తప్పనిసరిగా ఫాలో అయ్యే వాణ్ని అంటున్న ప్రసాద్ విజయ రహస్యం ఆయన మాటల్లోనే...
చాలా సంతోషంగా ఉంది:
మంచి ర్యాంకు వస్తుందనుకున్నా.. ఫస్ట్‌ర్యాంకు రావటం చాలా సంతోషంగా ఉంది. తెలుగుమీడియం విద్యార్థులైనా కొద్దిగా శ్రమిస్తే ఇంగ్లిషుపై మంచి పట్టు సాధించొచ్చు. అందుకు నాకు వచ్చిన ర్యాంకే నిదర్శనం. నా మొదటి ర్యాంకు గ్రామీణ విద్యార్థులందరికీ ప్రేరణ ఇస్తుందనే భావన మంచి అనుభూతినిస్తోంది.
ఇంగ్లిష్‌పై ఇష్టంతో:
మాది పశ్చిమగోదావరి జిల్లా, పక్కలంక గ్రామం. నాన్న వెంకట్రావు రిటైర్డ్ ఉద్యోగి. పదో తరగతిలో 380 మార్కులు, ఇంటర్ సెకండ్ క్లాసులో పాసయ్యా. డిగ్రీ 74 శాతం, పీజీలో 68.25శాతం తెచ్చుకున్నా. పదో తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలలోనే చదివాను. టాపర్‌ను కాదుకానీ ఫస్ట్‌క్లాస్ స్టూడెంట్‌నే. ఇంటర్ వరకూ తెలుగు మీడియంలోనే చదివా. డిగ్రీ ఇంగ్లిషు మీడియం కావటంతో ఆంగ్లంపై మంచిపట్టు లభించింది. అందరూ ఇంగ్లిషు అంటే భయపడుతుంటే నేను దాని అంతుచూడాలనే ఏఎన్‌యూలో ఎంఏ ఇంగ్లిషు పూర్తిచేశా.
ఆ ప్రిపరేషన్ కీలకం:
ఎడ్‌సెట్‌కోసం రోజూ 3-4గంటలు చదివా. చివర్లో మరింత ఎక్కువ సమయం వెచ్చించాను. ఏపీసెట్ రాసినప్పటి నుంచి పోటీపరీక్షలకు సిద్ధమవుతూ వస్తున్నా. పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించిన పాలిటెక్నిక్ లెక్చరర్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నా. ఆ ప్రిపరేషన్ ఎడ్‌సెట్‌లో టాపర్‌గా నిలిచేందుకు ఉపకరించింది. మారుతున్న సిలబస్‌కు అనుగుణంగా ప్రిపరేషన్‌లోనూ మార్పులు చేసుకుంటూ చదివేవాణ్ని. పత్రికల్లో వచ్చే మెటీరియల్‌ను బాగా అధ్యయనం చేశా. ముఖ్యంగా సాక్షి భవిత పోటీపరీక్షలకు అక్షర అస్త్రం. భవితను ప్రతి వారం తప్పనిసరిగా ఫాలో అయ్యే వాణ్ని. సాక్షి టీవీలో వచ్చే భవిత ప్రోగ్రాం మరింత అవగాహన పెంచింది.
ఇదే నా సలహా:
అభ్యర్థులు, విద్యార్థులు పోటీపరీక్షల సమయంలో పుస్తకాలతో కుస్తీ పట్టే బదులు దీర్ఘకాల ప్రణాళికతో చదివితే విజయం సాధించటం చాలా తేలిక. భావవ్యక్తీకరణకు అవసరమైన ఇంగ్లిషుపై పట్టుతెచ్చుకోవాలంటే.. అది దైనందిన చర్యలో భాగం కావాలి. ఇంగ్లిషు వార్తా పత్రికలు చదవాలి. ఇంగ్లిషు పుస్తకాలు చదవాలి. భాషపై అవగాహన పెరగాలంటే ఆ రెండూ కీలకం. మార్కెట్‌లో దొరికే మెటీరియల్‌తోపాటు ఇంటర్నెట్, పత్రికలు, టెక్స్‌బుక్స్ చదివితే విషయంపై అవగాహనతోపాటు లోతైన అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. దీంతో ప్రశ్నలు ఏ విధంగా ఇచ్చినా మన వద్ద సమాధానం ఉంటుంది. ఇదే పోటీపరీక్షలకు సిద్ధమయ్యే వారికి నేనిచ్చే సలహా!!

Published date : 21 Jun 2013 02:17PM