Skip to main content

ఒలింపిక్స్, కామన్వెల్త్ మెడల్సే నా లక్ష్యం.. పీసెట్ 2014 టాపర్ సాయి రేవతి

విద్యార్థిలో శారీరక, మానసిక వికాసాన్ని పెంపొందించే విద్య ఫిజికల్ ఎడ్యుకేషన్. మహిళలు అత్యంత అనాసక్తి చూపిస్తున్న రంగాల్లో క్రీడలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఉన్నాయి. కానీ అంకితభావం,క్రమశిక్ష ణ ఉంటే మహిళలు సైతం అద్భుతంగా రాణంచగలరని నిరూపించారు గుంటూరు జిల్లాకు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి ఘట్టమనేని సాయి రేవతి. బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష పీసెట్ 2014 లో ప్రథమ ర్యాంకు సాధించిన రేవతి గురించి ఆమె మాటల్లోనే...

ప్రథమ ర్యాంకు గురించి..
నాకు చాలా ఆనందంగా ఉంది. సాధనలో పడిన శ్రమకు ఫలితం దక్కింది. టాపర్‌గా నిలవాలనే పట్టుదలతోనే మా కోచ్ నల్లక శేషగిరి రావు గారు ఈ పరీక్షకు దరఖాస్తు చేయించారు. ఆయన ప్రోద్భలంతోనే ప్రథమ ర్యాంకు సాధించాను.

మీ కుటుంబ నేపథ్యం..
మాది తెనాలి మండలం పెదరావూరు. నాన్న రామకోటేశ్వర రావు. అమ్మ పద్మావతి. నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడే నాన్న చనిపోయారు. ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో మా అమ్మమ్మే నన్ను చదివించింది. నాకు ఒక అక్క. తను ఎంబీఏ చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుంది.

మీ టెస్ట్‌లో ఈవెంట్స్ గురించి..
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్:
100 మీటర్ల పరుగు పందెం 14.65 సెకన్లు, 400 మీటర్లు 81 సెకన్లలో పూర్తి చేశాను. జంపింగ్‌లో 4.04 మీటర్లు, షాట్‌పుట్‌లో 8.32 మీటర్లతో ప్రథమ స్థానంలో నిలిచాను.

స్కిల్ టెస్ట్: ఈ టెస్ట్‌లో ఆడిన హ్యాండ్‌బాల్‌లోనూ రాణించాను. ఈ విధంగా అన్ని ఈవెంట్స్‌లో టాపర్‌గా నిలవడంతో ప్రథమ ర్యాంకు సాధ్యమైంది.
ఇన్సెంటివ్ మార్క్స్: సీనియర్ నేషనల్ పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ ఉండటంతో 75 మార్కులు సాధించాను.

ప్రాక్టీస్ గురించి..
గత ఆరు సంవత్సరాలుగా నిరంతరాయంగా సాధన చేస్తున్నా. మధ్యలో ఇనుప రాడ్ తగిలి గాయపడినా భయపడలేదు. తిరిగి సాధన చేశాను. ఈ పరీక్షకు ముందు కూడా కోచ్ పర్యవేక్షణలో రోజుకు 7-8 గంటలు సాధన చేశాను. సర్ చెప్పిన టెక్నిక్స్‌ను పాటించడం వల్లే ప్రథమ ర్యాంకు సొంతమైంది.

వెయిట్ లిఫ్టింగ్‌ను ఎంచుకోవడానికి కారణం..
నేను కావాలని ఎంచుకోలేదు. కాలేజీలో వెయిట్ లిఫ్టింగ్‌కు ఆసక్తి ఉన్న వారు పేర్లు ఇవ్వమంటే నాతో పాటు మరో అమ్మాయి పేరు ఎవరో పంపించారు. అనుకోకుండా మా పేర్లు పిలిచినప్పటికీ వెయిట్ లిఫ్టింగ్ ప్రయత్నిద్దామనుకున్నాను. కానీ మాకోచ్ మాత్రం ‘అమ్మాయిలు చేయగలరా’ అని సందేహించివద్దన్నారు. తర్వాత మా ఆసక్తి, శ్రద్ధ గమనించి శిక్షణ ఇచ్చారు. మాలోని నైపుణ్యానికి మెరుగులు దిద్దారు. ఆయన ప్రోత్సాహం వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను.

వెయిట్ లిఫ్టింగ్ (63 కేజీల విభాగం)లో సాధించిన మెడల్స్...
  1. 2013లో కాలికట్‌లో జరిగిన సీనియర్ నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 2 గోల్డ్ మెడల్స్
  2. 2013లో బెంగళూరులో జరిగిన సీనియర్ నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్
  3. 2009లో మహారాష్ర్టలో జరిగిన సౌత్-వెస్ట్ ఇంటర్ యూనివర్శిటీ గేమ్స్‌లో సిల్వర్ మెడల్
  4. అమృతసర్‌లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానం
  5. కన్నూర్ విశ్వవిద్యాలయం, కేరళలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఐదోస్థానం
  6. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కింద వరుసగా ఐదు సార్లు ‘‘బెస్ట్ లిఫ్టర్’’, వరుసగా నాలుగు సార్లు ‘‘స్ట్రాంగ్ ఉమెన్’’ టైటిల్స్.
  7. జేఎన్‌టీయూ కాకినాడ కింద వరుసగా రెండు సార్లు ‘‘బెస్ట్ లిఫ్టర్’’, ‘‘స్ట్రాంగ్ ఉమెన్’’ టైటిల్స్
  8. జేఎన్‌టీయూ కాకినాడ కింద వరుసగా రెండు సార్లు 100, 200 మీటర్ల పరుగు పందెంలో ‘‘బెస్ట్ అథ్లెట్’’ టైటిల్స్
భవిష్యత్తు లక్ష్యాలు..
స్పోర్‌‌ట్స కోటాలో పోలీస్ డిపార్‌‌టమెంట్‌లో చేరాలనేదే నా లక్ష్యం. అక్కడ మెరుగైన శిక్షణ తీసుకుని మరిన్ని చాంపియన్‌షిప్‌ల్లో పాల్గొనాలి. ప్రస్తుతానికి సెప్టెంబర్‌లో గోవాలో జరగనున్న సీనియర్ నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్, డిసెంబర్‌లో జరగనున్న వరల్డ్ యూనివర్శిటీ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించడం నా లక్ష్యాలు. తగిన ప్రోత్సాహం, స్పాన్సర్‌‌స ఉంటే ఒలింపిక్స్, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనాలనేది నా దీర్ఘకాలిక లక్ష్యం.

క్రీడావిద్యను అభ్యసించాలనుకునేవారికి సలహా..
క్రీడలు పూర్తిగా మానసిక శారీరక దృఢత్వంపై ఆధారపడి ఉంటాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్ చదవాలనుకునే వారికి అంకిత భావం, క్రమశిక్షణ ఉండాలి. నిరంతరం సాధన చేయాలి. కోచ్‌లు చెప్పిన సూచనలు, సలహాలు పాటించి సాధన చేస్తే రాష్ర్ట, జాతీయ స్థాయిల్లో అనేక పతకాలు గెలుపొందొచ్చు. భవిషత్తులో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ లేదా స్పోర్‌‌ట్స అకాడమీల్లో కోచ్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు లేదా సొంతంగా స్పోర్‌‌ట్స క్లబ్స్ రన్ చేయవచ్చు.

చదువు:
పదో తరగతి:
60 శాతం
ఇంటర్: 75 శాతం
డిగ్రీ: 60 శాతం
ఎంబీఏ: 70 శాతం
ప్రస్తుతం ఎమ్మెస్సీ చదువుతున్నాను.
Published date : 30 Jun 2014 06:09PM

Photo Stories