నాన్న ప్రోత్సాహంతోనే విజయం
Sakshi Education
కొడుకు ఉన్నత చదువులు చదవాలని, దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో విద్యనభ్యసించాలని ఆ తల్లిదండ్రులు కలలు కన్నారు. నిత్యం వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ, ముందుకు నడిపించారు. ఆ అమ్మానాన్న నమ్మకాన్ని నిలబెట్టాడు.. కుడుముల ఆహ్వాన్ రెడ్డి. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో జాతీయస్థాయిలో ఆరో ర్యాంకు సాధించి తన బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకున్నాడు. ఈ సందర్భంగా అతని సక్సెస్ స్టోరీ...
మా స్వస్థలం నల్గొండ జిల్లా, పోచంపల్లి మండలం, పిలాయిపల్లి గ్రామం. నాన్న కుడుముల జగన్మోహన్ రెడ్డి. అమ్మ శైలజారెడ్డి గృహిణి. మాది వ్యవసాయాధారిత కుటుంబం. వారికి నేను ఒక్కడినే సంతానంతో కావడంతో నా చదువు మీద నాన్న చాలా శ్రద్ధ కనబరిచేవారు. నా చదువు కోసమే మా కుటుంబం హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌కు వచ్చి స్థిరపడింది.
విద్యాభ్యాసం ఇలా
విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే సాగింది. ఆరో తరగతి వరకు అబిడ్స్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివాను. ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఓ ప్రముఖ విద్యా సంస్థ నిర్వహించిన టాలెంట్ టెస్ట్‌లో టాప్ ర్యాంక్ రావడంతో ఇంటర్మీడియెట్ వరకు ఉచిత విద్యకు ఎంపికయ్యాను. ఇంటర్మీడియట్ హైదరాబాద్ లో మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు ఐఐటీ శిక్షణ సంస్థలో చదివాను.
గోల్డ్‌మెడల్ సాధించా...
జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ (ఎన్‌టీఎస్‌ఈ)లో అర్హత సాధించాను. దీని ద్వారా ప్రతి ఏడాది స్కాలర్‌షిప్ పొందుతున్నాను. ఇంటర్నేషనల్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్‌లో గోల్డ్ మెడల్ కూడా సాధించాను.
ప్రిపరేషన్ సాగిందిలా...
కాలేజీలో ఏ రోజు చెప్పిన అంశాలను అదే రోజే పూర్తి చేశా. ప్రతి వారం గ్రాండ్‌టెస్ట్‌లు రాయడం ద్వారా వేగాన్ని పెంచుకోగలిగా. పరీక్షలో ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుని విశ్లేషించుకున్నాను. పరీక్షకు వెళ్లేముందు ప్రణాళికలను సిద్ధం చేసుకుని పరీక్షలో ప్రశ్నను బట్టి వ్యూహాన్ని అమలు చేశాను. టీచర్స్ చెప్పిన నోట్స్‌తో పాటు ప్రత్యేకంగా నోట్స్ రాసుకున్నా. పరీక్షకు ముందు రివిజన్ చేసుకోవడానికి అది ఎంతగానో తోడ్పడింది. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా కాలేజీలో రోజూ ఉదయం యోగా క్లాసులు నిర్వహించే వారు. నాకు స్వతహాగా బాల్‌బ్యాడ్మింటన్ ఆడడం అలవాటు. సమయం చిక్కినప్పుడల్లా ఆడుతాను. నవలలు కూడా చదువుతా.
సొంతంగా సాధించేవాడిని
ఏదైనా కొత్త ప్రాబ్లమ్స్‌ను చూసినప్పుడు వెంటనే దాని సొల్యూషన్‌ను చూడకుండా నేనే సాధించడానికి ప్రయత్నించాను. దాని ద్వారా సమస్యలను సులువుగా, కొత్త పద్ధతిలో సాధించడానికి వీలవుతుంది. అదేవిధంగా ప్రశ్నలకు షార్ట్‌కట్‌లో సాధించే పద్ధతులను సిద్ధం చేసుకున్నాను.
గురువుల ప్రోత్సాహం
విద్యార్థులకు విభిన్న సమస్యలను ఇచ్చి సాధించాలని ఉపాధ్యాయులు సూచించేవారు. మ్యాథమెటిక్స్‌లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో ఆత్మవిశ్వాసం నింపేవారు. సమస్యలను వేగంగా సాధించేలా, మెరుగ్గా రాణించేందుకు కృషిచేశారు. ఉపాధ్యాయులు చెప్పే అంశాలతోపాటు ప్రాక్టీస్ కోసం ఇతర పుస్తకాలనూ చదివా.
ఐఐటీ బాంబేలో చేరుతా..
ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో చేరుతా. తర్వాత ఐఐఎం లేదా విదేశాల్లో ఎంబీఏ చేయాలనుకుంటున్నా. సొంతంగా కంపెనీ స్థాపించాలని అనుకుంటున్నాను.
కాన్సెప్ట్‌ల అధ్యయనంతో మేలు...
సబ్జెక్ట్‌ను చాలా లోతుగా అధ్యయనం చేయాలి. ఎక్కువ పుస్తకాలు చదివితే స్పష్టత లభిస్తుంది. కాన్సెప్ట్‌లను ఎక్కువగా నేర్చుకోవాలి. ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. కష్టపడి చదవితే ఏదైనా సాధ్యమే.
అకడమిక్ ప్రొఫైల్

- పదోతరగతి: 9.8 జీపీఏ
- ఇంటర్మీడియెట్: 985 మార్కులు
- ఏపీ ఎంసెట్ ర్యాంక్: 4
- టీఎస్ ఎంసెట్ ర్యాంక్: 14
- బిట్‌శాట్ మార్కులు: 438
- కేవైపీవై ర్యాంక్: 2
- జేఈఈ మెయిన్ స్కోరు: 330
- జేఈఈ అడ్వాన్స్‌డ్ స్కోరు: 430/504
Published date : 26 Jun 2015 04:41PM