బతుకుతెరువు ఉద్యోగం వద్దనుకున్నా
Sakshi Education
సాక్షి ఇంటర్వ్యూలో సివిల్స్ 656వ ర్యాంకర్ శివాజీ
సివిల్స్ రాయాలని నిర్ణయించుకుంటే సరిపోదు. లక్షలాది మంది జాతీయస్థాయిలో పోటీపడే పరీక్షలో అభ్యర్థి శక్తిసామర్థ్యాలు అడుగడుగునా పోటీలో మన స్థానాన్ని నిర్ణయిస్తాయి. అందుకే ప్రిలిమ్స్ నుంచి ఇంటర్వ్యూ వరకు ప్రతి అడుగు జాగ్రత్తగా ఆచితూచి వేయాలి. ప్రిపరేషన్ మొక్కుబడిగా ఉండకూడదు. సబ్జెక్టులపై ఫోకస్డ్‌గా ఉండాలి. చదివింది గంటైనా ఇష్టపడి చదవాలి. ఇప్పటివరకు మార్కెటింగ్ రంగంతోపాటు, వివిధ ఉద్యోగాల్లో పనిచేశా. ఈ ఉద్యోగాలతో బతుకుతెరువు సాధ్యమైంది. కాని సేవచేసే అవకాశం లేదు. అదే అఖిల భారత సర్వీసులకు ఎంపికైతే సేవచేసే అవకాశం ఉంటుందని సివిల్స్‌ను ఎంచుకున్నాను అంటున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన అంగూరు శివాజీ. ఇటీవల సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 656వ ర్యాంకు సాధించిన శివాజీతో సాక్షి ఇంటర్వ్యూ.
సివిల్స్ ఫలితాల్లో 656వ ర్యాంకు వచ్చింది కదా? కష్టానికి తగిన ఫలితం లభించిందనుకుంటున్నారా?
కొంత సంతోషంగానే ఉంది. వచ్చిన ఫలితాలపై సంబరపడిపోవడం లేదు. ఎందుకంటే.. ఇంకా మంచి ర్యాంకు తెచ్చుకుంటే బాగుండుననిపించింది. ప్రస్తుత ర్యాంకుతో నా లక్ష్యమైన ఐఏఎస్ రాదు. తిరిగి మళ్లీ సివిల్స్ రాసి.. నా కల నెరవేర్చుకుంటా. గతంలో మెయిన్స్ వరకు వెళ్లి వెనక్కి వచ్చా. ఈసారి ఏదో ఒక సర్వీసు తెచ్చుకున్నా. మూడోసారి మంచి ర్యాంకు సాధిస్తా. ఇప్పటి ఈ ర్యాంకు టానిక్‌గా ఉపయోగపడుతుందని భావిస్తున్నా.
మీ విద్యాభ్యాసం? కుటుంబ నేపథ్యం?
మాది శ్రీకాకుళం జిల్లా, బామిని మండలం లోహరిజోల గ్రామం. నాన్న రైతు. అమ్మ గృహిణి. హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఎంబీఏ మార్కెటింగ్ పూర్తిచేశా. ఆ తర్వాత వివిధ కంపెనీల్లో పనిచేశాను. సివిల్స్‌లో ఇది నా రెండో అటెంప్ట్. గతేడాది మొదటిసారి రాసినప్పుడు మెయిన్స్‌లో విఫలమయ్యా.
ఐఏఎస్ రాయాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారు? సివిల్స్‌పై ఆసక్తి కారణం?
ఇతర ఉద్యోగాలతో పోల్చితే సివిల్స్ కెరీర్ బాగుంటుంది. అంతేకాదు. ఐఏఎస్ లేదా ఐపీఎస్ అయితే ఉద్యోగ సంతృప్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు మార్కెటింగ్ రంగంతోపాటు ఉపాధి కోసం వివిధ కంపెనీల్లో పనిచేశాను. ఈ ఉద్యోగాలతో కేవలం బతుకుతెరువు మాత్రమే సాధ్యమైంది. కాని కనీసం ఒకరికైనా సేవ చేసే అవకాశం కలగలేదు. అదే అఖిల భారత సర్వీసులకు ఎంపికైతే ఉద్యోగ సంతృప్తితోపాటు మన పరిధిలో సాయం చేయడానికి అవకాశాలుంటాయి. పైగా అత్యున్నతస్థాయి సర్వీసుకు ఎంపికైతే ఆ సంతోషం జీవితాంతం ఉండడంతోపాటు జీవితంలో మరిన్ని విజయాలు సాధించడానికి ఎంతగానో దోహదపడుతుంది.
మీ ప్రిపరేషన్ వ్యూహం చెప్పండి?
రోజుకు 7 గంటల పాటు ప్రిపరేషన్ కొనసాగించా. నా ఆప్షనల్ సబ్జెక్టులు హిస్టరీ, జాగ్రఫీ. ఇవి రెండూ విస్తృతమైన సబ్జెక్టులు కావడంతో ప్రిపరేషన్ చాలాముందుగానే ప్రారంభించా. ప్రధానంగా పాఠ్యపుస్తకాలు బాగా చదివాను. ప్రతిచాప్టర్‌ను చదివిన వెంటనే వాటిని లోలోపల విశ్లేషించుకునేవాడిని. దీనివల్ల సబ్జెక్టుపై పట్టుపెరిగింది. అంతేకాదు రివిజన్ సమయంలో సులువుగా విషయం గుర్తుకొచ్చేది. దాంతో సివిల్స్ పరీక్షను బాగా రాయగలననే ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగాయి. ఆర్ట్స్ సబ్జెక్టులు కొత్త కావడంతో ఆప్షనల్స్ ప్రిపరేషన్ సమయంలో కొంచెం ఇబ్బందిపడ్డా. స్నేహితులు, నిపుణుల సూచనలు తీసుకుని మంచి పుస్తకాల గురించి తెలుసుకుని వాటిని ఫాలో అయ్యా. నిత్యం చదవడంతో క్రమేపీ సబ్జెక్టుపై ఆసక్తి పెరిగింది.
మీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? ఏయే అంశాలపై ప్రశ్నలు అడిగారు?
నా ఇంటర్వ్యూ సుమారు 20 నిమిషాలపాటు జరిగింది. మాది శ్రీకాకుళం జిల్లా కావడంతో నక్సలిజం, దాని నేపథ్యం, సమస్య పరిష్కారం వంటి పలు ప్రశ్నలు అడిగారు.
ప్రధానంగా...
సబ్జెక్టు ఏం చదివినా ఫోకస్డ్‌గా ప్రిపరేషన్ ఉండాలి. చదివింది గంటైనా ఇష్టపడి చదవాలి. అంతేకాదు ఎప్పటికప్పుడు సబ్జెక్టును మనసులో నిక్షిప్తం చేసుకుంటే పోటీలో ముందున్నాను అనే బావన కలుగుతుంది. దీనివలన ఎక్కడా నిరాశ దరిచేరదు. చాలామంది రోజుకు కనీసం 10గంటలు చదివితేనే సివిల్స్‌లో విజయం సాధించగలం అనుకుంటారు. ఎంతసేపు చదివాం అనేదికాకుండా... చదివినంతసేపు సబ్జెక్టును ఎంతవరకు అర్థం చేసుకున్నామనేదే ముఖ్యం. గతేడాది నుంచి ప్రిలిమ్స్ సిలబస్‌లో సంస్కరణలు చేశారు. అందువల్ల కేవలం పుస్తకంలో చదివింది మాత్రమే పరీక్షలో అడుగుతారనుకుంటే పొరపాటు. అందుకే సబ్జెక్టుతోపాటు ఇంగ్లిష్‌పై పట్టు పెంచుకుంటేనే కనీస స్కోరు చేయగలం.

- అసలు నక్సలిజం ఎందుకు పుట్టింది?
- నక్సలిజం గురించి మీకు తెలిసింది చెప్పండి?
- నక్సలిజంతోపాటు సమాజంలో ఇతర నేరాల వల్ల శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలుగుతుంది?
- ఈ సమస్యకు పరిష్కారం ఏంటి?
- మీ హాబీలు గురించి చెబుతారా?(నా హాబీ బర్డ్‌వాచింగ్ అని చెప్పా)
- బర్డ్‌వాచింగ్ వలన ఉపయోగం? ఇదేం హాబీ? వంటి ప్రశ్నలు అడిగారు.
సబ్జెక్టు ఏం చదివినా ఫోకస్డ్‌గా ప్రిపరేషన్ ఉండాలి. చదివింది గంటైనా ఇష్టపడి చదవాలి. అంతేకాదు ఎప్పటికప్పుడు సబ్జెక్టును మనసులో నిక్షిప్తం చేసుకుంటే పోటీలో ముందున్నాను అనే బావన కలుగుతుంది. దీనివలన ఎక్కడా నిరాశ దరిచేరదు. చాలామంది రోజుకు కనీసం 10గంటలు చదివితేనే సివిల్స్‌లో విజయం సాధించగలం అనుకుంటారు. ఎంతసేపు చదివాం అనేదికాకుండా... చదివినంతసేపు సబ్జెక్టును ఎంతవరకు అర్థం చేసుకున్నామనేదే ముఖ్యం. గతేడాది నుంచి ప్రిలిమ్స్ సిలబస్‌లో సంస్కరణలు చేశారు. అందువల్ల కేవలం పుస్తకంలో చదివింది మాత్రమే పరీక్షలో అడుగుతారనుకుంటే పొరపాటు. అందుకే సబ్జెక్టుతోపాటు ఇంగ్లిష్‌పై పట్టు పెంచుకుంటేనే కనీస స్కోరు చేయగలం.
Published date : 08 May 2012 05:25PM