ఆన్‌లైన్ కోచింగ్ ద్వారానే..గ్రూప్–1 ఉద్యోగం సాధించానిలా....
Sakshi Education
గ్రూప్స్‌లో విజేత కావాలన్న 'ఆశ'కు ఓ అవకాశం వచ్చింది.. నలుగురిలో ఒకరిగా నిలబడాలన్న కసికి భర్త ప్రోత్సాహం తోడైంది.. ఇంకేముంది పట్టుదల ముందు లక్ష్యం తలవంచింది.
కష్టానికి ఫలితం దక్కింది.. విజయం సలాం అంటూ ఆమె ఒడిలోకి వచ్చి వాలింది. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరుకు చెందిన ఆయేషా గ్రూప్స్-1లో బీసీ–ఈ మహిళా విభాగంలో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచి శభాష్ అనిపించారు. యువతకు ఆదర్శంగా నిలిచారు.
Published date : 03 Dec 2021 06:19PM