అమ్మ పంచిన విజయం - ఎడ్‌సెట్-2013 బయాలజీ మొదటిర్యాంకర్ వీరవల్లి ప్రవీణ్‌కుమార్
Sakshi Education
చిన్నపాటి ఇబ్బందులకే అమ్మో అనుకుంటారు. సకల సౌకర్యాలు సమకూర్చినా.. చదవాలంటే బద్దకం. కానీ చిన్నతనంలోనే నాన్న దూరమై.. అమ్మ పడే కష్టాన్ని చూస్తూ ఉన్నతంగా ఎదగాలనే లక్ష్యంతో శ్రమించిన యువకుడు 120 మార్కులతో ఎడ్‌సెట్-2013 బయాలజీ విభాగంలో స్టేట్‌ఫస్ట్‌ర్యాంకు సాధించాడు. వేలాది మందితో పోటీపడి తొలిసారే మొదటిర్యాంకు దక్కించుకున్నాడు. కష్టపడటమేనంటూ తన విజయ రహస్యమని చెబుతోన్న వీరవల్లి ప్రవీణ్‌కుమార్ సక్సెస్ స్టోరీ.. అతని మాటల్లోనే..
ఆనందంగా ఉంది...
ఫస్ట్‌ర్యాంకు రావటం చాలా ఆనందంగా ఉంది. వెయ్యిలోపు ర్యాంకు వస్తుందనుకున్న నాకు 120 మార్కులతో మొదటిర్యాంకు రావటం ఆశ్యర్యంగా.. ఆనందంగానూ ఉంది.
అంతా అమ్మే:
మా సొంతూరు కృష్ణాజిల్లా నాగాయలంక. నాన్న వెంకటేశ్వరరావు ఉన్న రెండెకరాల పొలంలో పంట పండిస్తూ కుటుంబాన్ని పోషించేవారు. నా నాల్గో ఏటనే నాన్న చనిపోయారు. అప్పటి వరకూ ఇల్లే ప్రపంచం అనుకున్న అమ్మ జయలక్ష్మి అధైర్యపడలేదు. నన్నూ, చెల్లిని ఎంతో కష్టపడి పెంచింది. ఆ రోజు నుంచి మాకు అన్నీ అమ్మే అయ్యింది. మంచి చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేయాలనే తలంపుతో తాను కష్టపడేది. మేం కష్టాలు పడకూడదనే ఉద్దేశంతో ఏ రోజూ మాలో ఆత్మవిశ్వాసం సడలకుండా చూసేది. ఆమె కష్టం ఫలితమే నా విజయం.
చదువులో ఎప్పుడూ బెస్టే:
చిన్నప్పటి నుంచి చదువులో ఎప్పుడూ ఫస్ట్ ఉండేవాణ్ని. అమ్మ చెప్పిన మాటలు మనసులో నాటుకుపోవటం వల్ల.. బాగా చదివి ఉన్నతస్థాయిలో ఉండాలనే పట్టుదల పెరిగింది. పదోతరగతి వరకూ నాగాయలంకలో చదివా. ఇంటర్ సికింద్రాబాద్, డిగ్రీ విజయవాడ సిద్ధార్థలో చదివాను. టెన్త్‌లో 519, ఇంటర్‌లో 798 మార్కులు వచ్చాయి. డిగ్రీ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాను.
మా చెల్లి స్ఫూర్తి:
ఈ వృత్తిలోకి వచ్చేందుకు మా చెల్లి శిరీష స్ఫూర్తి. తను టీటీసీ పూర్తిచేసి టీచర్‌గా పని చేస్తోంది. మైక్రోబయోలజీ సబ్జెక్టు ఉన్న వారికి ఎడ్‌సెట్ అవకాశం లేకపోవటం ఇప్పటివరకూ రాయలేకపోయా. ఈ ఏడాది అవకాశం ఇవ్వటంతో మంచి ప్రణాళికతో ప్రిపేరయ్యాను. ల్యాబ్‌లో పనిచేస్తూ చదివినా సరైన ప్రణాళికతో చదవటం వల్ల ర్యాంకు వచ్చింది.
రెండు నెలలు సీరియస్‌గా చదివా:
ఎడ్‌సెట్‌లో మంచి ర్యాంకు సాధించాలనే లక్ష్యంతో చివరి రెండు నెలలు చాలా సీరియస్‌గా చదివాను. ల్యాబ్‌లో పనిచేస్తూ సమయాన్ని వృథా చేయకుండా ప్రణాళికతో సిద్ధమయ్యా. ఇంటర్ నుంచి ఇంగ్లీష్ మీడియం కావటంతో గ్రామర్‌పై పట్టుచిక్కింది. మంచి స్కోరు చేసేందుకు కారణమైంది. ఇదే ఉత్సాహంతో డీఎస్సీలో మంచి ర్యాంకు సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెడతా.
సీరియస్‌గా తీసుకోండి:
పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నామంటేనే... లక్షల మందితో పోటీపడుతున్నట్లు గుర్తుంచుకోవాలి. ఎడ్‌సెట్‌లో మంచి ర్యాంకు రావాలంటే.. కనీసం రెండు నెలలు కష్టపడాలి. నేను రోజుకు 4 గంటలు చదివేవాణ్ని. చివర్లో 8 గంటలు కూడా చదివా. టెక్ట్స్‌బుక్స్, ఇంగ్లీష్ గ్రామర్, జీకే వంటి అంశాల్లో మంచి పట్టు సాధిస్తే సాధారణ విధ్యార్థులు కూడా మంచి ర్యాంకు సాధించవచ్చు.

Published date : 20 Jun 2013 08:51PM