Skip to main content

S-400 Missile System: S-400 మిస్సైల్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో వివరంగా తెలుసుకుందాం

రష్యా అభివృద్ధి చేసిన ఎస్‌-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ సుమారు 400 కిలోమీటర్ల దూరంలోని వైమానిక లక్ష్యాలను గుర్తించి ఖచ్చితంగా ధ్వంసం చేయగలదు. ఇది నాలుగు రకాల క్షిపణులతో శత్రు విమానాలు, క్రూజ్ క్షిపణులు, అలాగే బాలిస్టిక్ క్షిపణులను తాకే సామర్థ్యం కలిగిన అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ అత్యంత ప్రధాన పాత్ర నిర్వహించినట్లు రక్షణ నిపుణులు చెబుతున్నారు.
Russian-developed S-400 missile system in action  S-400 Missile System: S-400 మిస్సైల్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో  వివరంగా తెలుసుకుందాం
S-400 Missile System: S-400 మిస్సైల్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో వివరంగా తెలుసుకుందాం

భారత ప్రభుత్వం 2018లో రష్యాతో 5 యూనిట్ల S-400 వ్యవస్థ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో కొన్ని ఇప్పటికే భారత్‌కు చేరాయి. దీని వల్ల భారత్ యొక్క వాయుసేన రక్షణ సామర్థ్యం బహుళపరిమాణంలో పెరిగింది. ఇది చాలా శక్తివంతమైన రక్షణ వ్యవస్థ. మీరు దీని గుండె (రాడార్), బ్రెయిన్ (కమాండ్ సెంటర్), చేతులు (లాంచర్‌లు) అన్నట్లు ఊహించవచ్చు.

S-400 మిస్సైల్ వ్యవస్థ అంటే ఏమిటి?
S-400 ట్రయంఫ్ (Triumf) అనేది రష్యా రూపొందించిన ఒక అధునాతన వాయుసేన రక్షణ వ్యవస్థ. ఇది విమానాలు, క్రూజ్ మిస్సైళ్లు, బాలిస్టిక్ మిస్సైళ్లను క్షిపణి దూరం నుంచే గుర్తించి, వాటిని ఖచ్చితంగా తిప్పికొట్టగలదు.

S-400 మిస్సైల్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
S-400 వ్యవస్థ రాడార్‌లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, లాంచర్‌లు, వివిధ రకాల మిస్సైళ్లను కలిగి ఉంటుంది. దీని పని విధానం నాలుగు ప్రధాన దశల్లో జరుగుతుంది:

1. గుర్తింపు (Detection)

  • పెద్ద శక్తి గల రడార్ వ్యవస్థ 600 కి.మీ. దూరం వరకు శత్రు విమానాలను, డ్రోన్లు, మిస్సైళ్లను గుర్తిస్తుంది.

2. ట్రాకింగ్ (Tracking)

  • గుర్తించిన లక్ష్యాల మీద రడార్ నిరంతరం నిగాహవేస్తుంది.
  • వాటి వేగం, దిక్కు, ఎత్తు వంటి సమాచారాన్ని గమనిస్తుంది.

3.నిర్ణయం (Command Decision)

  • కమాండ్ సెంటర్ లక్ష్యం ప్రమాదకరమా కాదా అని నిర్ణయిస్తుంది.
  • అవసరమైతే లక్ష్యం మీద మిస్సైల్ ప్రయోగించేందుకు ఆదేశిస్తుంది.

4. దాడి (Engagement)

  • సదరు లక్ష్యం దూరం, వేగం ఆధారంగా సరైన రకం మిస్సైల్‌ను ఎంచుకుంటుంది.
  • ఆ మిస్సైల్ తక్షణమే లక్ష్యం మీద ప్రయోగించబడుతుంది.

S-400

ఎలాంటి మిస్సైళ్లు S-400లో ఉంటాయి?

S-400 వ్యవస్థలో నాలుగు రకాల మిస్సైళ్లు ఉపయోగించవచ్చు:

మిస్సైల్ పేరు పరిధి (Range) లక్ష్యం
40N6E ~400 కిమీ AWACS, జెట్‌లు, ICBMs
48N6DM ~250 కిమీ ఫైటర్ జెట్‌లు, డ్రోన్లు
9M96E2 ~120 కిమీ వేగంగా కదిలే చిన్న లక్ష్యాలు
9M96E ~40 కిమీ సమీప విమానాలు, డ్రోన్లు

1) 40N6E :-- ఇది 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాంబర్‌ విమానాలను, అవాక్స్‌ విమానాలను ధ్వంసం చేయగలదు.

2) 48N6DM :-- ఇది 250 కిలోమీటర్ల దూరంలోని విమానాలను, డ్రోన్లు, బాలిస్టిక్‌ క్షిపణులను ధ్వంసం చేస్తుంది.

3) 9M96E2 :-- ఇది 120 కిలోమీటర్ల రేంజ్‌ కలిగి తక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాలను అతి వేగంగా కూల్చగలదు.

4) 9M96E :-  ఇది 40 కిలోమీటర్ల రేంజ్‌ కలిగి వేగంగా వచ్చే విమానాల్ని, క్షిపణుల్ని అత్యంత కచ్చితత్వంతో కూలుస్తుంది.

ప్రత్యేకతలు

  • 360° కవరేజ్ తో ఒకే సమయాన 80 లక్ష్యాలను ట్రాక్ చేయగలదు.
  • ఎలాంటి వాతావరణం అయినా పనిచేస్తుంది.
  • తక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాలపై కూడా దాడి చేయగలదు.

ఇదీ చదవండి: S-400 మిస్సైల్‌ ఎలా పనిచేస్తుందో.. LIVEలో 

☛ Follow our YouTube Channel  (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Published date : 09 May 2025 10:35AM

Photo Stories