Skip to main content

Inspiring Success Story : రోడ్లపై చిత్తు కాగితాలు ఏరుకుని బ‌తికా.. నేడు ఏకంగా నెలకు రూ.5 కోట్లుపైగా సంపాదిస్తున్నానిలా..

యాదగిరి ఆర్థిక ఇబ్బందులు భరించలేక.. ఏదో సాధించాలని హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. బ‌త‌క‌డానికి చిత్తు కాగితాలు ఏరుకున్నాడు.
మంగినిపల్లి యాదగిరి
మంగినిపల్లి యాదగిరి

ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎదిగాడు. ఏళ్లు తిరిగే సరికి కోట్లలో లావాదేవీలు జరిపే స్థాయికి ఎదిగాడు. ఈయ‌న స‌క్సెస్ స్టోరీ చ‌దివితే షాక్ అవ్వాల్సిందే..

నిరుపేద కుటుంబం.. డబ్బుల్లేక..
ఆయన పేరు మంగినిపల్లి యాదగిరి. చదువుకున్నది పదో తరగతి నిరుపేద కుటుంబంలో జన్మించి డబ్బుల్లేక నాన్న ఇబ్బందులు పడి వీరి కుటుంబం ఆర్థికపరంగా వెనుకబడి ఉంది. ఎలాగైనా సరే మరో ఇద్దరి తమ్ముళ్లను మంచి చదివించి, ఉన్నత స్థాయికి తీసుకురావాలని కోరికతో గ్రామంలో బతుకుదెరువు కష్టమని హైదరాబాద్​కు వచ్చి చెత్త కాగితాలను ఏరుకుంటూ జీవనం సాగించాడు. చెత్త కాగితాలను ఏరు కోవడం ప్రారంభించాడు. అక్కడి నుంచి ఆయన తల రాతే మారింది. అది ఎలా అనుకుంటున్నారా అయితే ఆయన మాటల్లోనే..

Inspiring Success Story: తిండి కోసం రోడ్ల‌పై చిత్తు కాగితాలను ఏరుకున్నాడు.. నేడు అంతర్జాతీయ స్థాయి గుర్తింపుతో..

కుటుంబ నేప‌థ్యం : 
మాది మెదక్ జిల్లా నిజాంపేట్‌ మండలం కల్వకుంట్ల గ్రామం. తల్లిదండ్రులు మంగినిపల్లి పోచమ్మ, పోచయ్య. నలుగురు అన్నదమ్ముల్లో నేను పెద్దవాడిని. ఆస్తులేం లేకున్నా మా నాన్న అందర్నీ చదివించాడు. 

ఒక పాత సైకిల్‌పై..
ఆ రోజుల్లో మా ఊళ్లో ఏదైనా పండుగైతే, హైదరాబాద్‌ నుంచి వేస్ట్‌ పేపర్‌ వ్యాపారులు వచ్చేవారు. డబ్బులు బాగా ఖర్చు పెట్టేవారు. భారీగా విరాళాలు ఇచ్చేవారు. వాళ్లను చూసి నేను కూడా హైదరాబాద్‌ వెళ్లి, చెత్త వ్యాపారంలోకి దిగాలనుకున్నా. నాన్న వద్దని చెప్పినా వినకుండా 1996లో హైదరాబాద్‌ వచ్చేశా. చెత్త కాగితాలు, పుస్తకాలు సేకరించడం ప్రారంభించా. మొదట్లో నెత్తిన గంప పెట్టుకొని కాలినడకనే తిరిగేవాణ్ని. విద్యానగర్‌, నల్లకుంట, శంకరమఠం ప్రాంతాల్లో వ్యాపారం చేశా. రూపాయి రూపాయి కూడబెట్టి ఏడాది తర్వాత ఒక పాత సైకిల్‌ కొనుక్కున్నా.

Success Story: టెన్త్‌, ఇంట‌ర్ తప్పాడు.. ప్ర‌తి నెల రూ.3 లక్షలకు పైగా జీతంతో ఉద్యోగం.. ఈయ‌న స్టోరీ చూస్తే షాక్ అవ్వ‌ల్సిందే..

మూడు రోజులు ఇసుకలోనే పడుకున్నా..
సొంత వ్యాపారం..నన్ను విడిచి ఉండలేక అమ్మానాన్న, తమ్ముళ్లు.. అందరూ హైదరాబాద్‌ వచ్చేశారు. చిన్న డబ్బా పెట్టుకోవడానికి నాన్నను ఐదువేలు అడిగా. ఆయన ఇవ్వలేదు. కోపంతో ఇంట్లోంచి వచ్చేశా. చిక్కడపల్లిలోని అంబేద్కర్‌ స్కూల్‌లో మూడు రోజులు ఇసుకలోనే పడుకున్నా. నా బాధ చూసి నాన్నకు అమ్మ సర్దిచెప్పింది. ఏదోలా ఐదువేలు ఇచ్చారు.

అంతా బాగుందనుకొనే సమయానికి.. సడన్​గా షాకింగ్ న్యూస్‌..

scrap business


ఆ మొత్తంతో నారాయణగూడలో ఒక చిన్న డబ్బా ఏర్పాటు చేసుకున్నా. వీధివీధి తిరుగుతూ చిత్తు కాగితాలు, పుస్తకాలు సేకరించే వారి నుంచి సరుకు కొనడం ప్రారంభించా. ఆ తర్వాత ఇంకో తమ్ముడితోనూ షాపు పెట్టించా. కొన్ని రోజులకు నాన్న కూడా సాయం చేయడం మొదలుపెట్టారు. అంతా బాగుందనుకొనే సమయానికి, మాకు మెటీరియల్‌ అమ్మే వాళ్లంతా షాపులు పెట్టుకున్నారు. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడే మరో ఆలోచన వచ్చింది. ఓ గోడౌన్‌ అద్దెకు తీసుకొని, షాపులు పెట్టిన వారి దగ్గరి నుంచే సరుకు కొనడం మొదలుపెట్టా.

Success Story: పెట్టుబ‌డి రూ.50 వేలు.. ఆదాయం రూ.20 కోట్లు.. ఇదే నా సక్సెస్ మంత్ర..

దేశంలోని అన్ని పేపర్‌ మిల్లులకూ..

scrap business profit margin


క్యాష్‌ అండ్‌ క్యారీ.. ఈ వ్యాపారంలో అప్పటికే . .ఎంతోమంది ఉన్నారు. అయితే, నేను మాత్రం సరుకు ఇచ్చిన వెంటనే డబ్బులు ఇస్తానని చెప్పా. అప్పటివరకు అలా ఇచ్చిన వ్యాపారులు లేరు. దీంతో బిజినెస్‌ పెరిగింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ రోజు నాకు అంబర్‌పేటలో మూడు పెద్ద గోడౌన్లు ఉన్నాయి. వాటి నుంచి దేశంలోని అన్ని పేపర్‌ మిల్లులకూ సరుకు వెళ్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచీ మెటీరియల్‌ నా దగ్గరికి వస్తుంది. నా దగ్గర 80మంది ఉపాధి పొందుతున్నారు. నెలకు రూ.5 కోట్ల లావాదేవీలు జరుపుతున్నా. ఏడు వాహనాలు ఉన్నాయి. రూ.కోటి విలువ చేసే మిషనరీ ఉన్నాయి.

Success Story : మొదటి ప్రయత్నం విజయవంతంగా ఫ్లాప్‌..నాడు చాలా కష్టం అన్నవాళ్లే నేడు..

నిన్ను చూస్తే గర్వంగా అనిపిస్తుంది బిడ్డా.. అని..
తమ్ముళ్లను బాగా చదివించా. ఒక తమ్ముడు ప్రభుత్వ ఉద్యోగి. మరొక తమ్ముడు వ్యాపారంలో నాకు తోడుగా ఉంటున్నాడు. నాకు ఇద్దరు పిల్లలు. అంతా సంతోషంగా కలిసి మెలిసి ఉంటాం. ఒకప్పుడు హైదరాబాద్‌ వెళ్తానంటే వద్దన్న నాన్నే.. ఈ రోజు ‘ నిన్ను చూస్తే గర్వంగా అనిపిస్తుంది బిడ్డా ’ అంటున్నారు. చిత్తు కాగితాలు, పాత పుస్తకాలు కొనే దగ్గర నుంచి ఇంత పెద్ద వ్యాపారాన్ని నిర్వహించే స్థాయికి ఎదిగినందుకు సంతోషంగా ఉంది.

ఈ ప్రాంతంలో నా అడ్రస్‌ను ఎవరిని అడిగినా..

మంగినిపల్లి యాదగిరి


అంబర్‌పేట్‌ అలీ కేఫ్‌ దగ్గరికి వెళ్లి ఎవరిని అడిగినా.. నా అడ్రస్‌ చెబుతారు. ఈ గుర్తింపు.. నా కష్టానికి ఫలితం. సామాజిక సేవలోనూ.. సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సాయం చేయాలనుకున్నా. మా ఊరి పాఠశాలలో పలు అభివృద్ధి పనులు చేశా. బాగా చదువుకునే పిల్లలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని మొత్తం మండలానికి విస్తరించాలని నిర్ణయించుకున్నా. ఇందుకోసం ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పని చేస్తున్నా. మా ఊరి శివాలయానికి నా వంతుగా రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చా. ఆ పనులన్నీ దగ్గరుండి నేనే చేయిస్తున్న‌న్నారు.

Inspiration Story: ఓ నిరుపేద కుటుంబం నుంచి వ‌చ్చి..వేల కోట్లు సంపాదించాడిలా..

Motivational Story: కుంగిపోలేదు.. పోరాడి గెలిచాడు.. తనతో పాటు నలుగురికి..

Published date : 07 Mar 2022 03:34PM

Photo Stories