Skip to main content

యూపీఎస్సీ ఫలితాల్లో 2 తెలుగు రాష్ట్రాల నుంచి టాప్‌ ర్యాంక్‌.. ధాత్రిరెడ్డి!

సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ/కడప ఎడ్యుకేషన్‌/మైదుకూరు: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ వంటి అత్యున్నత సర్వీసుల పోస్టులకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌–2019 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు విజయఢంకా మోగించారు.

100లోపు ర్యాంకుల్లో ఐదుగురు తెలుగువారున్నారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో దాదాపు 50 మంది వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఆయా సర్వీసులకు ఎంపికయ్యారు. గతంలో కంటే ఈసారి పోస్టులు తక్కువ ఉన్నా ఎక్కువ మంది తెలుగు అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. దేశవ్యాప్తంగా మొత్తం 829 మంది ఐఏఎస్, ఐపీఎస్, తదితర కేడర్‌ పోస్టులకు, గ్రూప్‌ ఏ, గ్రూప్‌ బి సర్వీసులకు ఎంపికయ్యారు.

సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు అభ్యర్థుల హవా
యాదాద్రి– భువనగిరి జిల్లాకు చెందిన పి.ధాత్రిరెడ్డి సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో అల్‌ ఇండియా 46వ ర్యాంకు సాధించి భేష్‌ అనిపించుకున్నారు. ధాత్రిరెడ్డి గతంలో సివిల్స్‌ రాసి 283 ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఐపీఎస్‌ శిక్షణలో ఉన్న ఆమె మళ్లీ పట్టుదలతో సివిల్స్‌ రాసి ఐఏఎస్‌లో 46వ ర్యాంకును సాధించారు. యూపీఎస్‌సీ మంగళవారం వెల్లడించిన సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ప్రతిభ చాటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అధికసంఖ్యలో ఎంపికై సివిల్స్‌లో తమ సత్తా చాటారు. ప్రతిష్టాత్మకమైన ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌కు 829 మంది ఎంపిక కాగా అందులో 50 మందికి పైగా తెలుగు విద్యార్థులు ఉన్నారు. సివిల్‌ సర్వీసెస్‌– 2019కు సంబంధించిన తుది ఫలితాలు మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసింది. ఇందులో 829 మంది అభ్యర్థులను సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపిక చేసినట్లు ప్రకటించింది. సివిల్స్‌కు ఎంపికైన వారిలో 304 మంది జనరల్‌ కేటగిరీలో ఎంపికయ్యారు. కొత్తగా అమల్లోకి తెచ్చిన ఎకనమికల్లీ వీకర్‌ సెక్షన్‌ (ఈడబ్ల్యూ ఎస్‌) కోటాలో 78 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఓబీసీ కేటగిరీలో 251, ఎస్సీ 129, ఎస్టీ కేటగిరీలో 67 మంది ఉద్యోగాలు సాధించారు. ఈ ఫలితాల్లో హరియాణాకు చెందిన ప్రదీప్‌సింగ్‌ ఆల్‌ ఇండియా టాపర్‌గా నిలిచారు. ఇక జతిన్‌ కిషోర్‌ రెండో ర్యాంకు, ప్రతిభా వర్మ మూడో ర్యాంకు సాధించారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి మల్లవరపు సూర్య తేజ 76వ ర్యాంకు, కట్టా రవితేజ 77వ ర్యాంకు, సింగారెడ్డి రిషికేశ్‌ రెడ్డి 95వ ర్యాంకు సాధించి టాప్‌ 100లో నిలిచారు. టాప్‌ 100 నుంచి 200లోపు ర్యాంకుల్లో మరో ఐదుగురు తెలుగు అభ్యర్థులు ఉండటం విశేషం. ఇక 200 నుంచి 300 ర్యాంకుల్లోపు మరో పది మంది సాధించారు.

ర్యాంకర్ల వివరాలు
ఐపీఎస్‌ శిక్షణ పొందుతూనే...పెద్దిటి ధాత్రిరెడ్డి – 46వ ర్యాంకు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం గుండ్లబావి గ్రామంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన పెద్దిటి కృష్ణారెడ్డి–సుశీలాదేవి దంపతుల కుమార్తె ధాత్రిరెడ్డి 46వ ర్యాంకు సాధించి తెలుగు రాష్ట్రాల్లో టాపర్‌గా నిలిచారు. 2016లో బీటెక్‌ పూర్తి చేసిన ధాత్రిరెడ్డి ఏడాది క్రితమే ఐపీఎస్‌కు ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. చిన్ననాటి నుంచి ఐఏఎస్‌ కావాలన్న లక్ష్యం మేరకు శిక్షణ పొందుతూనే మరోసారి పరీక్షలు రాశారు. అనుకున్న మేరకు లక్ష్యాన్ని సాధించి కలెక్టర్‌గా ఎంపిక కానున్నారు.

తండ్రి లక్ష్యం నెరవేర్చా.. మల్లవరపు సూర్యతేజ – 76వ ర్యాంకు
గుంటూరులోని శ్యామలనగర్‌కు చెందిన మల్లవరపు సూర్యతేజ రెండో ప్రయత్నంలోనే సివిల్స్‌ సాధించారు. ‘నేను ఐఏఎస్‌ కావాలన్నది నా తండ్రి లక్ష్యం. 2014లో ఆయన మరణించారు. నా తండ్రి లక్ష్యం నేరవేర్చడం కోసం టీసీఎస్‌లో వచి్చన జాబ్‌ను కూడా వదలుకుని కఠోర దీక్షతో చదివాను. నా రెండో ప్రయత్నంలోనే 76వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. నా ఈ విజయంలో మా అమ్మ సంధ్యారాణి సహకారం కూడా చాలా ఉంది. పేద విద్యార్ధులకు నాణ్యమైన విద్య, స్కిల్‌ డెవలప్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్‌పై ఫోకస్‌ చేయడమే నా లక్ష్యం’అని వివరించారు.

పోస్టల్‌ ఉద్యోగానికి సెలవు పెట్టి.. కె.రవితేజ – 77వ ర్యాంకు
మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం బుద్దారం గ్రామానికి చెందిన కట్టా రమణయ్య, ప్రసూన కుమారుడు కట్టా రవితేజ రెండో ప్రయత్నంలోనే 77వ ర్యాంకు సాధించారు. గతేడాది సివిల్స్‌లో 349వ ర్యాంకు సాధించిన రవితేజ.. ఇండియన్‌ పోస్టల్‌ సరీ్వసెస్‌ కేడర్‌లో చేరినా సెలవు పెట్టి మళ్లీ పరీక్షలు రాసి లక్ష్యం చేరుకున్నారు.

ప్రధానిని కలకుండా అడ్డుకున్నారని.. ఐశ్యర్య షిరాన్‌ – 93వ ర్యాంకు
కరీంనగర్‌ ఎన్‌సీసీ 9టీ బెటాలియన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్, రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన అజయ్‌కుమార్‌ కుమార్తె ఐశ్వర్య షిరాన్‌ సివిల్స్‌లో 93వ ర్యాంకు సాధించారు. ఢిల్లీలోనే డిగ్రీ వరకు చదివిన ఐశ్వర్య 23 ఏళ్లకు తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి అతి పిన్నవయసులోనే సివిల్‌కు ఎంపికయ్యారు. ఢిల్లీలో ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీని కలిసేందుకు ప్రయతి్నంచగా అధికారులు అడ్డుకున్నారు. ప్రధానిని కలవాలంటే సివిల్స్‌ అధికారి లేదా పెద్ద నేతలై ఉండాలని, అదీ అపాయింట్‌మెంట్‌ ఉండాలని చెప్పడంతో ఆమె సివిల్‌ సరీ్వసెస్‌పై దృష్టి పెట్టి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు.

క్రికెట్‌ వదిలి సివిల్స్‌కు.. సత్యసాయి కార్తీక్‌ – 103
‘నాకు క్రికెట్‌ అంటే పిచ్చి. అండర్‌–19 హైదరాబాద్‌ స్టేట్‌ టీమ్‌లో సభ్యుడిగా కొనసాగాను. క్రికెట్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్నాను. నా లక్ష్యం సివిల్స్‌పై పడింది. ఐఏఎస్‌ కావాలని అనుకున్నా. దీక్షతో మొదటి ప్రయత్నంలోనే 103వ ర్యాంక్‌ సాధించాను’అని హైదరాబాద్‌ నల్లకుంటకు చెందిన ఎంవీ సత్యసాయి తెలిపారు. ఆయన తండ్రి ఎస్‌బీఐలో ఉద్యోగి కాగా, తల్లి బోటిక్‌ నిర్వహిస్తున్నారు.

రూ.30 లక్షల ప్యాకేజీ వదులుకుని.. మందా మకరందు – 110వ ర్యాంకు
సిద్దిపేటకు చెందిన మందా మకరందు రెండో ప్రయత్నంలో 110వ ర్యాంకు సాధించారు. రూ.30 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తున్నప్పటికీ, ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు ప్రిపేరై విజయం సాధించారు. పేదల వలసల నివారణకు చర్యలు చేపట్టడమే తన లక్ష్యమని వివరించారు.

ఆరో ప్రయత్నంలో 117వ ర్యాంకు ... రాహుల్‌కుమార్‌ రెడ్డి, పెండ్లిమర్రి, వైఎస్సార్‌ జిల్లా
మాది.. వ్యవసాయ కుటుంబం. ఐదుసార్లు సివిల్స్‌ రాసినా ఫలితం దక్కలేదు. నిరాశ చెందకుండా ఆరో ప్రయత్నంలో 117వ ర్యాంక్‌ సాధించాను.

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. కె.ప్రేమ్‌సాగర్, 170వ ర్యాంకు
‘మాది ఉమ్మడి వరంగల్‌ జిల్లా పాలకుర్తి సమీపంలోని వలిమిడి గ్రామానికి చెందిన దిగువ మధ్య తరగతి కుటుంబం. మా నాన్న మార్కెటింగ్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేసేవారు. బీటెక్‌ అయ్యాక కాగ్నిజెంట్‌లో ఉద్యోగం చేశాను. ఐదేళ్ల తర్వాత సివిల్స్‌వైపు దృష్టిసారించి 2018లో మొదటిసారి ప్రయత్నించాను. 2019లో పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడంతో 170 ర్యాంకు వచి్చంది. నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైంది’అని కె.ప్రేమ్‌సాగర్‌ తెలిపారు.

తొలిప్రయత్నంలోనే... సత్యప్రకాష్‌ – 218వ ర్యాంకు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం తంగడపల్లికి చెందిన బడేటి అశోక్‌–మమతల కుమారుడు సత్యప్రకాష్‌ తొలి ప్రయత్నంలోనే 218వ ర్యాంకు సాధించారు. ఆయన తండ్రి బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం చేస్తున్నారు. 2018లో పాట్నాలో బీటెక్‌ పూర్తి చేసిన సత్యప్రకా‹Ù.. అప్పటినుంచి సివిల్స్‌ కోసం ప్రిపేరై.. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు.

ఎంతో సంతోషంగా ఉంది... సందీప్‌కుమార్‌– 244వ ర్యాంకు
‘మాది సూర్యా పేట జిల్లా హుజూర్‌నగర్‌. తల్లిదండ్రులు విద్యుత్‌ ఉద్యోగులు. బీటెక్‌ తర్వాత ఐఏఎస్‌ చదవాలని కోరికతో ఢిల్లీలోని కాన్స్‌ స్టడీ గ్రూపులో చదివాను. మూడుసార్లు తక్కువ ర్యాంకు వచ్చింది. నాలుగోసారి 244 ర్యాంకు రావడంతో సంతోషంగా ఉంది’అని సందీప్‌ పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలోనే చదివా..శివగోపాల్‌రెడ్డి, 263వ ర్యాంక్‌ మైదుకూరు
మా నాన్న.. రైతు. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివా.

ట్రాన్స్‌కో ఏఈ నుంచి.. బొంత రాహుల్‌ – 272వ ర్యాంకు
నారాయణపేట జిల్లా దామరగిద్ద మం డలం ఆశన్‌పల్లి ఒంటి బుర్జుకి చెందిన నర్సింహులు–శశికళ దంపతుల కుమారుడు బొంత రాహుల్‌ 272వ ర్యాంకు సాధించారు. ట్రాన్స్‌కో టెక్నికల్‌ ఏఈగా పనిచేస్తున్న రాహుల్‌.. సివిల్స్‌ సాధించాలని 2018 జూలైలో రెండేళ్ల పాటు లాంగ్‌ లీవ్‌ పెట్టి ప్రిపేరయ్యారు.

నాలుగో ప్రయత్నంలో అత్యుత్తమ ర్యాంక్‌.. రుషికేశ్‌రెడ్డి, కడప
సివిల్స్‌ మూడో ప్రయత్నం (2017)లో ఐఆర్‌ఎస్‌ సాధించాను. సివిల్స్‌ కోసం రోజూ 8 నుంచి 9 గంటలపాటు ప్రణాళికాబద్ధంగా చదివాను.

తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు

పేరు

ర్యాంకు

పెద్దిటి ధాత్రిరెడ్డి

46

పంకజ్‌

56

మల్లవరపు సూర్యతేజ

76

కట్టా రవితేజ

77

ఐశ్వర్యా షిరాన్‌

93

సింగారెడ్డి రుషికేష్‌రెడ్డి

95

ఎంవీ సత్యసాయి కార్తీక్‌

103

మందా మకరందు

110

టి.రాహుల్‌కుమార్‌ రెడ్డి

117

కేసారపు ప్రేమ్‌సాగర్‌

170

జి.ఛండీష్‌

198

వికాస్‌ కుమార్‌

203

ప్రత్యూష్‌ ఎస్‌

216

సత్యప్రకాష్‌

218

పిన్నని సందీప్‌ కుమార్‌

244

సి చైతన్యకుమార్‌రెడ్డి

250

చీమల శివగోపాల్‌రెడ్డి

263

బి. రాహుల్‌

272

వి. తేజ దీపక్‌

279

గొరిజాల మోహనకృష్ణ

283

అభిషేక్‌కుమార్‌

288

విశాల్‌ కుమార్‌

293

సచిన్‌ కుమార్‌ యాదవ్‌

296

ఎ వెంకటేశ్వర్‌రెడ్డి

314

సిరిసెట్టి సంకీర్త్‌

330

ముత్తినేని సాయితేజ

344

రేణుకుంట్ల శీతల్‌కుమార్‌

417

వివేక్‌ చంద్ర యాదవ్‌

425

ముక్కెర లక్ష్మి పవన గాయత్రి

427

కొల్లాబత్తుల కార్తీక్‌

428

వివేకానంద శుక్లా

457

వివేక్‌రెడ్డి ఎన్‌

485

బానోతు మృగెందర్‌లాల్‌

505

కొరుపోలు సత్య ధర్మ ప్రతాప్‌

510

రాకేష్‌

512

డి.వినయ్‌కాంత్‌

516

నీతిపూడి రష్మితరావు

534

వైవీఆర్‌ శశిశేఖర్‌

539

కోరుకొండ సిద్దార్థ్‌

566

మిథున్‌ రాజా యాదవ్‌ బేరి

568

చిలుముల రజనీకాంత్‌

598

అలేఖ్య బళ్ల

602

సి. సమీర్‌రాజా

603

జువ్వనపూడి మహేష్‌

612

సాయిని అభిషేక్‌

627

కిరణ్మయి కొప్పిశెట్టి

633

పుసులూరు రవికిరణ్‌

655

దరిపెల్లి రమేష్‌

690

బానోత్‌ రాకేష్‌ నాయక్‌

694

పలని ఫణికిరణ్‌

698

రాహుల్‌ రాథోడ్‌

745

కె ప్రతిమ

757

కె శశికాంత్‌

764

బచ్చు ధీరజ్‌కుమార్‌

768

అకునూరి నరేష్‌

782

Published date : 05 Aug 2020 05:40PM

Photo Stories