Skip to main content

యూపీఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ-2021 పరీక్ష నోటిఫికేషన్ విడుదల

సాక్షి, ఎడ్యుకేషన్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)..నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ),నావల్ అకాడమీ (ఎన్‌ఏ)-2021 నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇంటర్‌తోనే దీనిద్వారా ఎన్‌డీఏ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ)కి చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో.. అలాగే ఇండియన్ నావల్ అకాడమీలో ప్రవేశాలు పొందవచ్చు. దీని ద్వారా త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగంతో పాటు ఉచితంగా ఉన్నత విద్యను పూర్తిచేసు కోవచ్చు. ఆసక్తి, అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: డిసెంబర్ 30, 2020.
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: జనవరి 19, 2021.
  • ఎన్‌డీఏ, ఎన్‌ఏ-2021 పరీక్ష తేది: ఏప్రిల్ 18, 2021.
అర్హతలు, వయసు, పరీక్ష విధానం తదితర పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://upsc.gov.in
Published date : 30 Dec 2020 03:09PM

Photo Stories