Skip to main content

ఉద్యోగార్థుల కోసం గూగుల్ ‘కొర్మో జాబ్స్’ యాప్

న్యూఢిల్లీ: ఉద్యోగార్థుల కోసం తమ ‘కొర్మో జాబ్స్’ యాప్‌ను భారత్‌లో ప్రవేశపెడుతున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది.
రిటైల్, హాస్పిటాలిటీ తదితర రంగాల వ్యాపార సంస్థల్లో ఉద్యోగాల కోసం తెలుసుకునేందుకు, దరఖాస్తు చేసుకునేందుకు గూగుల్ గతేడాది ‘జాబ్స్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీన్ని ఇకపై ‘కొర్మో జాబ్స్’ కింద రీబ్రాండ్ చేయనున్నట్లు గూగుల్ రీజనల్ మేనేజర్ బికీ రసెల్ తెలిపారు. వాస్తవానికి జాబ్స్ ఫీచర్‌ను 2018లో బంగ్లాదేశ్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించామని, ఆ తర్వాత కొర్మొ జాబ్స్ పేరిట ఇండొనేషియాలో ప్రవేశపెట్టామని ఆయన పేర్కొన్నారు.
Published date : 20 Aug 2020 02:18PM

Photo Stories