త్వరలో 20 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారీ ఎత్తున పోలీసు నియామకాలు చేపట్టనున్నట్టు హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు.
దాదాపు 20వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు. నగరంలోని తెలంగాణ పోలీస్ అకాడమీ (టీఎస్‌పీఏ)లో శుక్రవారం 12వ బ్యాచ్‌కు చెందిన 1,162 మంది సబ్- ఇన్‌స్పెక్టర్ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా 18,428 మంది ఎస్.ఐ, కానిస్టేబుళ్ల నియా మకం జరిపామని, ఇంకా ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలను కూడా త్వరలోనే నియ మించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు తెలి పారు.
Must check: TS Police Exams guidance, bit banks, previous papers and model papers
డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నిజాయితీ, నిబద్ధతతో పని చేస్తూ సాంకేతికతను విరివిగా ఉపయోగిం చడం ద్వారా స్మార్ట్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. తెలంగాణ పోలీస్ అకాడమీ ఇన్‌చార్జ్ డెరైక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అకాడమీ ద్వారా ఇప్పటివరకు 1,25,848 మంది వివిధ ర్యాంకులకు చెందిన వారికి శిక్షణనిచ్చామని తెలిపారు. తమ అకాడమీ ఆసియాలోనే అత్యుత్తమ శిక్షణా అకాడమీగా గుర్తింపు పొందిందని, సెంటర్ ఫర్ ఎక్సలెన్‌స హోదాను కూడా పొందిందని వివరించారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారిలో 661 మంది సివిల్, 28 మంది ఐటీ కమ్యూనికేషన్, 448 మంది ఆర్.ఎస్.ఐ.లు, ఫింగర్ ప్రింట్‌కు చెందిన 25మంది ఎ.ఎస్.ఐ.లు ఉన్నారని తెలిపారు. శిక్షణలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ఎస్‌ఐలకు మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డిలు పురస్కారాలను ప్రదానం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్‌ఐలలో 68 ఇంజనీర్లు, 37 మంది ఎంబీఏ చేసిన వారు ఉన్నారు.

Published date : 24 Oct 2020 04:36PM