ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు 20,178 దరఖాస్తులు.. ఆగస్టు 18న ఫలితాలు..
Sakshi Education
భైంసా(ముధోల్): నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ ముగిసింది.
చదవండి: సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణ బడులు ప్రారంభం!
చదవండి: నాడు–నేడుతో సర్వాంగ సుందరంగా తరగతి గదులు
అధికారులు ఈసారి పాలిసెట్ అర్హతతో సీట్లు కేటాయించనున్నారు. ఆగస్టు 2న ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా, ఆగస్టు 12 వరకు గడువు ప్రకటించారు. ప్రత్యేక కేటగిరీ కింద ఆగస్టు 14 వరకు సడలింపు ఇచ్చారు. దీంతో 20,178 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందు లో 19,253 సాధారణ దరఖాస్తులు కాగా, గ్లోబల్ కేటగిరీలో 925 మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసి ఆగస్టు 18న జాబితా విడుదల చేయనుంది. గతేడాది 1,500 సీట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈ సారి వెయ్యి సీట్లకే పరిమితం చేస్తుందా.. లేదంటే 1,500 సీట్లు కేటాయిస్తుందా అనే విషయం తేలాల్సి ఉంది. త్వరలో విద్యార్థుల జాబితా ప్రకటిస్తామని ట్రిపుల్ ఐటీ ఏవో రాజేశ్వర్‌రావు తెలిపారు.
చదవండి: సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణ బడులు ప్రారంభం!
చదవండి: నాడు–నేడుతో సర్వాంగ సుందరంగా తరగతి గదులు
Published date : 17 Aug 2021 02:42PM