Skip to main content

టీఎస్‌లాసెట్, పీజీఎల్‌సెట్‌– 2021 దరఖాస్తు గడువు జూలై 5 వరకు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌లాసెట్‌–21, పీజీఎల్‌సెట్‌–21 దరఖాస్తు గడువును జూలై 5 వరకు పొడిగిస్తున్నట్లు కన్వీనర్‌ జీబీ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థులు నిర్దేశించిన గడువులోగా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. రూ.250 అపరాధ రుసుముతో జూలై 15 వరకు, రూ.500 ఫైన్‌తో జూలై 24 వరకు, రూ.1,000 ఫైన్‌తో ఆగస్టు 2 వరకు, రూ.2,000 ఫైన్‌తో ఆగస్టు 10 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పించవచ్చని తెలిపారు. ఆగస్టు 12న హాల్‌టికెట్లు జారీ చేస్తామని, ఆగస్టు 23న పరీక్ష ఉంటుందని వెల్లడించారు.
Published date : 26 Jun 2021 03:11PM

Photo Stories