Skip to main content

టీఎస్‌ఎస్‌పీలో 272 పోస్టుల రద్దు

సాక్షి, హైదరాబాద్:తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్‌ఎస్‌పీ)కి చెందిన 272 రెగ్యులర్ పోస్టులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
డీజీపీ ఆధీనంలో ఉండే ఈ పోస్టులను పలుమార్లు పరిశీలించిన అనంతరం రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆర్థికశాఖ గురువారం జీవో జారీ చేసింది. మరోవైపు హోంశాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సూపర్ న్యూమరరీ పోస్టుకు అంగీకారం తెలుపుతూ ఆర్థికశాఖ ఆదేశాలిచ్చింది.
Published date : 04 Sep 2020 02:35PM

Photo Stories