Skip to main content

టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ సెట్‌–2021 పరీక్ష వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని గురుకుల జూనియర్‌ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ సెట్‌–21 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు సెట్‌ కన్వీనర్‌ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
వాస్తవానికి ఏప్రిల్‌ 4వ తేదీన జరగాల్సిన ఈ పరీక్షను కోవిడ్‌–19 వ్యాప్తి నేపథ్యంలో వాయిదా వేసినట్లు వివరించారు. పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు.
Published date : 29 Mar 2021 04:10PM

Photo Stories