టీఎస్ పీజీఈసెట్- 2020 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ గడువు నవంబర్ 25 వరకు పొడిగింపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంటెక్, ఎం.ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా ఆన్‌లైన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్లు పీజీఈసెట్ అడ్మిషన్స్ కన్వీనర్ ప్రొఫెసర్ రమేశ్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యార్థులు తమ సర్టిఫికెట్లను స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలని సూచించారు. ఈ కౌన్సెలింగ్‌లో గేట్‌లో అర్హత సాధించిన వారు 1,417 మంది, పీజీఈసెట్‌లో అర్హత సాధించిన వారు 14,456 మంది మొత్తంగా 15,873 మంది విద్యార్థులు ఉన్నట్లు వివరించారు.
Published date : 19 Nov 2020 01:53PM