Skip to main content

టీఎస్ పీజీ ఈసెట్ సీట్లు పొందిన విద్యార్ధులు డిసెంబర్ 16లోపు రిపోర్టు చేయాలి

సాక్షి, హైదరాబాద్: ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్చ్ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి మొదటి విడత కౌన్సెలింగ్‌లో 5,331 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు.
విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో డిసెంబర్ 11 నుంచి 16వ తేదీలోపు రిపోర్టు చేయాలని టీఎస్ పీజీఈసెట్ ప్రవేశాల కన్వీనర్ రమేశ్‌బాబు గురువారం ఓ ప్రకటనలో సూచించారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో మొత్తం 8,132 సీట్లకు 7,686 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోగా 5,331 మందికి సీట్లు కేటాయించినట్లు వివరించారు. మిగతా 2,801 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ నెల 14 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
Published date : 11 Dec 2020 03:15PM

Photo Stories