Skip to main content

టీఎస్ పీఈసెట్ 2020 ఫలితాల్లో సిద్దిపేట జిల్లా విద్యార్థినికి ఫస్ట్ ర్యాంక్

సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీఈసెట్-2020లో 95.94% మంది అర్హత సాధించారు.
పీఈసెట్‌కు ఈ ఏడాది 7,368 మంది దరఖాస్తు చేసుకోగా, 4,903 మంది పరీక్షలకు హాజరయ్యారు. 4,704 మంది (95.94 శాతం) అర్హత సాధించారు. వీరిలో 2,833 మంది బీపీఈడీ అభ్యర్థులు, 1,871 మంది డీపీఈడీ అభ్యర్థులు ఉన్నారు. బీపీఈడీలో టాప్ 10 ర్యాంకుల్లో సాధించిన వారిలో నలుగురు ఎస్టీ, ముగ్గురు ఎస్సీ, ఇద్దరు బీసీ, ఒకరు ఓసీ కేటగిరీకి చెందిన వారు ఉన్నారు. డీపీఈడీలో టాప్ 10 ర్యాంకుల్లో ఆరుగురు ఎస్టీ, ముగ్గురు బీసీ, ఒకరు ఎస్సీ కేటగిరీకి చెందిన వారు ఉన్నారు. పీఈసెట్-2020 ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి శుక్రవారం విడుదల చేశారు. పీఈసెట్‌లో టాప్ ర్యాంకులను ఎస్సీ, ఎస్టీ, బీసీలే అత్యధికంగా సాధించడం మంచి పరి ణామమని పాపిరెడ్డి అన్నారు. తెలంగాణలో సామాజిక మార్పునకు నాంది అని పేర్కొ న్నారు. అర్హత సాధించిన విద్యార్థులు తమ వెబ్‌సైట్ (https://pecet.tsche. ac.in) నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ సూచించారు. కార్య క్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి, కార్యదర్శి శ్రీనివాస రావు, మహాత్మా గాంధీ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేట జిల్లా విద్యార్థినికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూర్ గ్రామానికి చెందిన హ్యాండ్‌బాల్ క్రీడాకారిణి జక్కుల నవనీత పీఈ సెట్‌లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్‌ను సాధిం చింది. బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) విభాగంలో ఆమె ఈ ఘనత సాధించింది. గ్రామీణ ప్రాంతానికి చెందిన నవనీత హ్యాండ్‌బాల్ క్రీడలో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పలు గోల్డ్ మెడల్స్ సాధించింది. వ్యాయామ విద్యను పూర్తి చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా విద్యార్థులను తీర్చిదిద్దుతానని నవనీత తెలిపింది. తనకు మొదటి ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉందని, తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులు నర్సింలు- ఐలమ్మలకు, తనకు విద్యాబుద్ధులతో పాటు క్రీడల్లో తర్ఫీదునిచ్చిన గురువులకు కృతజ్ఞతలు తెలిపింది.
Published date : 16 Nov 2020 03:36PM

Photo Stories