Skip to main content

టీఎస్ పీఈసెట్ 2020 దరఖాస్తు గడువు ఆగస్టు 31 వరకు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్: పీఈసెట్ దరఖాస్తు గడువును ఈనెల 31వ తేదీ వరకు పెంచుతున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బీపీఈడీ, డీపీఈడీ కళాశాలల వినతిని దృష్టిలో ఉంచుకుని గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు పీఈసెట్‌కి 6,161 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో బీపీఈడీకి 3,659, డీపీఈడీకి సంబంధించి 2,503 దరఖాస్తులు ఉన్నాయని ఉన్నత విద్యా మండలి వివరించింది.
Published date : 18 Aug 2020 01:42PM

Photo Stories