టీఎస్ పాలిసెట్‌కు 77 శాతం హాజరు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం బుధవారం నిర్వహించిన పాలిసెట్‌కు 77 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.
బాలురు 80 శాతం మంది హాజరు కాగా, బాలికలు 74 శాతం మంది హాజరైనట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) కార్యదర్శి సి.శ్రీనాథ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 285 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్ష రాసేందుకు 73,918 మంది (బాలురు 43,950, బాలికలు 29,968) దరఖాస్తు చేసుకోగా పరీక్షకు 56,814 మంది (బాలురు 34,479, బాలికలు 22,335) హాజరయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లోని 30,760 డిప్లొమా (ప్రభుత్వ కాలేజీల్లో 11,980, ప్రైవేటు కాలేజీల్లో 18,780) సీట్ల భర్తీకి, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో 870 సీట్ల భర్తీకి ఈ పరీక్షను నిర్వహించినట్లు వెల్లడించారు. పాలిటెక్నిక్ డిప్లొమా సీట్లలో అత్యధికంగా ఈఈఈలో 7,305 సీట్లు, మెకానికల్‌లో 6,285, సివిల్‌లో 5,945, ఈసీఈలో 5,695, కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో 2,560, మైనింగ్‌లో 900 సీట్లు ఉన్నాయని, మిగతా సీట్లు ఇతర కోర్సుల్లో ఉన్నట్లు తెలిపారు.
Published date : 03 Sep 2020 12:36PM