టీఎస్ ఐసెట్–2021 నోటిఫికేషన్ విడుదల...దరఖాస్తు చివరి తేదీ ఇదే
Sakshi Education
కేయూ క్యాంపస్/సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల (2021–2022)కు నోటిఫికేషన్ విడుదలైంది.
వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో ఇన్‌చార్జి రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎస్.మహేందర్‌రెడ్డి, టీఎస్ ఐసెట్ కనీ్వనర్ కె.రాజిరెడ్డితో కలిసి ఏఫ్రిల్ 3వ తేదీన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది కూడా ఈ ప్రవేశపరీక్ష నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ఉన్నత విద్యామండలి కాకతీయ యూనివర్సిటీకి అప్పగించింది. వచ్చే ఆగస్టు 19, 20 తేదీల్లో ఈ ఎంట్రన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. లేట్ ఫీజు లేకుండా జూన్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు చివరితేదీగా నిర్ణయించారు. ఏఫ్రిల్ 7వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫారమ్‌లను, ఆన్‌లైన్‌లో రిజి్రస్టేషన్, దాఖలును ప్రారంభిస్తారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు రూ.450, మిగతా అన్ని కేటగిరీల విద్యార్థులకు రూ.650 ప్రవేశ రుసుముగా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో జూన్ 30వరకు రూ.250, జూలై 15 వరకు రూ.500, ఆగస్టు 15 వరకు రూ.1,000 లేట్ ఫీజుతో దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. ప్రవేశ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 14 ప్రాంతీయ కేంద్రాల్లో దాదాపు 60 పరీక్షా కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు టీఎస్‌ఐసెట్–2021 కనీ్వనర్ రాజిరెడ్డి వెల్లడించారు. ఆగస్టు 13 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఆగస్టు 27న ప్రాథమిక ‘కీ’విడుదల, ‘కీ’పై అభ్యంతరాల సమర్పణ ఆగస్టు 31 వరకు, తుది ‘కీ’, ప్రవేశపరీక్ష ఫలితాలను సెపె్టంబర్ 17న విడుదల చేస్తామన్నారు. అర్హతలు, సిలబస్, మోడల్ పేపర్, సంబంధిత సమాచారం, ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణ, ఆన్‌లైన్ ఎగ్జామ్, ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలు, మాక్‌టెస్ట్‌లు తదితర వివరాలు జ్టి్టp://జీఛ్ఛ్టి.్టటఛిజ్ఛి.్చఛి.జీn వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కాగా, రాష్ట్రంలో 267 ఎంబీఏ కాలేజీలు ఉండగా అందులో 32,337 సీట్లు.. 35 ఎంసీఏ కాలేజీలకు గాను 2,491 సీట్లున్నాయని కేయూ అధికారులు వెల్లడించారు.
Published date : 05 Apr 2021 05:41PM