Skip to main content

టీఎస్ ఐసెట్- 2020 ఫలితాల్లోటాప్ ర్యాంకర్లు వీరే ..

కేయూ క్యాంపస్: తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కో ర్సుల్లో ప్రవేశానికి నిర్వ హించిన టీఎస్ ఐసెట్ ఫలితాలను సోమవారం విడుదల చేశారు.
వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల సెమినార్ హాల్‌లో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య టి.పాపిరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 45,975 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, 41,506 మంది ఉత్తీర్ణత (90.28 శాతం) సాధించారు. పురుషుల్లో 22,912 మందికి గాను 20,816 మంది (90.85 శాతం) మంది, మహిళల్లో 23,059 మందికి గాను 20,686 మంది (89.71శాతం) ఉత్తీర్ణత సాధించారు. నలుగురు ట్రాన్స్ జెండర్లు కూడా ఉత్తీర్ణత సాధించారు. కాగా, ప్రవేశాల షెడ్యూల్‌ను ఈనెల 10వ తేదీ తర్వాత వెల్లడిస్తామని పాపిరెడ్డి పేర్కొన్నారు. వివిధ యూనివర్సిటీల్లో డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షల జవాబు పత్రాలు వాల్యూయేషన్ జరుగుతుండగా, డిగ్రీ బ్యాక్‌లాగ్ సబ్జెక్టుల పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉందని తెలిపారు. ఎంబీఏ, ఎంసీఏ కలిపి రాష్ట్రంలో గత ఏడాది 27,500 సీట్లు ఉండగా, ఈసారి సీట్ల సంఖ్యను త్వరలోనే వెల్లడిస్తామని వివరించారు.

టాప్ ర్యాంకర్లు వీరే ..

పేరు

ర్యాంకు

మార్కులు

ప్రాంతం

బి.సుభశ్రీ

1

159.5507

హైదరాబాద్

గని సందీప్

2

144.50129

నిజామాబాద్

అవినాష్

3

142.43267

హైదరాబాద్

అడ్ల ప్రసన్నలక్ష్మి

4

142.00654

వరంగల్

మాదరవోని శ్రీకృష్ణసాయి

5

141.40193

రంగారెడ్డి

తిప్పర్తి అఖిల్‌రెడ్డి

6

140.93344

రంగారెడ్డి

జోయ్‌దీప్ దేవ్

7

14022663

పశ్చిమ బెంగాల్

పాతి లఖిల్‌రెడ్డి

8

139.11914

ఆంధ్రప్రదేశ్

వీఎస్.రాజశేఖర్‌రెడ్డి

9

136.50805

గుంటూరు

మహ్మద్ సోహైల్

10

135.86276

కొత్తగూడెం

పల్లె వరుణ్

11

135.84593

నల్లగొండ

సాయి కుతాక్షయరెడ్డి

12

133.94354

రంగారెడ్డి

వినోద్‌కుమార్‌రెడ్డి

13

133.23259

నిర్మల్

కె.ఆర్తి

14

132.80343

హైదరాబాద్

కోగంటి ప్రద సాయిచౌదరి

15

13272643

విజయవాడ

పాగోలు శిరీష

16

13200050

హైదరాబాద్

ఆర్.వెంకటసాయి వశిష్ట

17

130.50026

మంచిర్యాల

డి.సాయికృష్ణ కపిల్‌రెడ్డి

18

130.31211

మేడ్చల్

వట్టుమల్లి కనకమాధవి

19

129.89054

మేడ్చల్

సి.రంజిత్

20

128.79897

రంగారెడ్డి

Published date : 03 Nov 2020 04:35PM

Photo Stories