టీఎస్ ఐసెట్ 2020 ప్రారంభం
Sakshi Education
కేయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న టీఎస్ ఐసెట్ బుధవారం ప్రారంభమైంది.
టీఎస్ ఐసెట్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కలిపి 58,452 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తొలి రోజు మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగింది. తొలి సెషన్‌లో 77 శాతం, రెండో సెషన్‌లో 79 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు టీఎస్ ఐసెట్ కన్వీనర్ ఆచార్య రాజిరెడ్డి తెలిపారు. రెండు రాష్ట్రాల్లో 14 రీజినల్ సెంటర్ల పరిధిలో 70 పరీక్ష కేంద్రాలలో ఈ పరీక్ష జరిగిందన్నారు. కాగా, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య టి.పాపిరెడ్డి కాకతీయ యూనివర్సిటీలోని ఐసెట్ కార్యాలయాన్ని సందర్శిచారు. అనంతరం ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం సెట్‌ను ఎంపిక చేశారు. ఆయన వెంట అచార్య కె.పురుషోత్తం ఉన్నారు.
Published date : 01 Oct 2020 01:00PM