Skip to main content

టీఎస్ ఐసెట్-20 నోటిఫికేషన్ విడుదల

కేయూ క్యాంపస్: తెలంగాణ రాష్ట్రంలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలకు టీఎస్‌ఐసెట్- 2020 నోటిఫికేషన్ విడుదలైంది.
ఐసెట్ కన్వీనర్, కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి దీనిని జారీచేశారు. కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఈ పరీక్షకు సంబంధించి వివరాలను శుక్రవారం ఆయన రిజిస్ట్రార్ పురుషోత్తంతో కలసి మీడియాకు వివరించారు.

టీఎస్ ఐసెట్- 2020 స్టడీ మెటీరియల్, గెడైన్స్, మోడల్ ఆన్‌లైన్ టెస్ట్స్, ప్రీవియస్ పేపర్స్...ఇతర అప్‌డేట్స్ కొరకు క్లిక్ చేయండి.

ఈనెల 9 నుంచి అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని, అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450, మిగతావారు రూ.650 ఫీజు చెల్లించాల్సింటుందని పేర్కొన్నారు. రూ.500 అపరాధ రుసుముతో మే 6 వరకు, రూ.2,000 అపరాధ రుసుముతో మే 11 వరకు, రూ.5,000 అపరాధ రుసుముతో మే 16 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. మే 14 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్ష మే 20, 21 తేదీల్లో ఉంటుందని, 20న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు, 21న ఒక సెషన్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గం టల వరకు నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్ర ంలో 14 రీజనల్ సెంటర్ల పరిధిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ప్రిలిమినరీ కీని మే 27న విడుదల చేస్తామని, అభ్యంతరాలను జూన్ 1 వరకు స్వీకరించి జూన్ 12న ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. అదేరోజు తుదికీని కూడా వెల్లడిస్తామని అన్నారు. సిలబస్, మోడల్ పేపర్ తదితర వివరాలను కేయూ వెబ్‌సైట్‌లో చూడవచ్చని వెల్లడించారు. ఈ సమావేశంలో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేందర్ పాల్గొన్నారు.
Published date : 07 Mar 2020 03:43PM

Photo Stories