‘తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు (సెట్)’ ఈసారికి లేనటే్ట !
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈసారి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు(సెట్) నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది.
సెట్ నిర్వహణకు 2017లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఇచ్చిన అక్రెడిటేషన్ గడువు 2019తో ముగిసింది. ఇక 2020లో నిర్వహించాలంటే యూనివర్సిటీకి యూజీసీ ఇచ్చిన అక్రెడిటేషన్ రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంది. అయితే ఓయూకు రెగ్యులర్ వైస్ చాన్స్ లర్ లేకపోవడం, ఐఏఎస్ అధికారే ఇన్‌చార్జిగా ఉండటం, ఆయన వర్సిటీ కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోవడం, మరోవైపు కరోనా, లాక్‌డౌన్ వంటి కారణాలతో సెట్ నిర్వహణకు అవసరమైన అక్రెడిటేషన్‌పై దృష్టి సారించలేదు. ఇప్పటికిప్పుడు ప్రతిపాదనలు రూపొందించి, ప్రభుత్వ ఆమోదం తీసుకొని యూజీసీకి పంపించడం కూడా కష్టమే. యూజీసీ నుంచి అక్రెడిటేషన్ రెన్యువల్ చేస్తూ ఉత్తర్వులు వెలువడేందుకు కనీసంగా 6 నెలలు పట్టనుంది. దీంతో ఈసారి సెట్ నిర్వహించే పరిస్థితి లేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు (నెట్) అర్హత/ సెట్‌లో అర్హత/ పీహెచ్‌డీలలో ఏదో ఒకటి ఉండాలి. అయితే ఈసారికి సెట్ నిర్వహించే పరిస్థితి లేదు.
Published date : 25 Sep 2020 02:50PM