తెలంగాణ గురుకుల సీఓఈ కాలేజీల్లో ప్రవేశ పరీక్ష వాయిదా
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని సీఓఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ) కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ వాయిదా పడింది.
వాస్తవానికి ఏప్రిల్8వ తేదీన అర్హత పరీక్ష నిర్వహించాల్సి ఉంది. దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంతో ఈ పరీక్షను వాయిదా వేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలు ప్రకటించాయి. ఈ పరీక్ష నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని, విద్యార్థుల తల్లిదండ్రుల సెల్‌ఫోన్లకు సంక్షిప్త సమాచారాన్ని అందిస్తామని స్పష్టం చేశాయి.
Published date : 06 Apr 2020 03:28PM