Skip to main content

తెలంగాణ ఎంసెట్ 2021 షెడ్యూల్ విడుదల.. పరీక్ష తేదీలు ఇవే..

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ స్ట్రీమ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంసెట్–21 షెడ్యూల్ విడుదలైంది.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి శనివారం తన కార్యాలయంలో షెడ్యూల్‌ విడుదల చేశారు. ఎంసెట్‌ నోటిఫికేషన్ ఈనెల 18న విడుదల కానుం డగా.. ఈనెల 20 నుంచి ఆన్‌లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. మే 18 వరకు దరఖాస్తుకు గడువుగా నిర్ధారించింది. అపరాధ రుసుముతో జూన్ 28 వరకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. జూలై 5 నుంచి ఎంసెట్‌ పరీక్షలు సీబీటీ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) విధానంలో జరగనున్నాయి. జూలై 5, 6 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్‌ పరీక్షలు జరుగుతాయి. జూలై 7, 8, 9 తేదీల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయం త్రం 6 గంటల వరకు ఇంజనీరింగ్‌ పరీక్షలు జరుగుతాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో 23 టెస్ట్‌ జోన్ల పరిధిలోని 58 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణ ఎంసెట్‌– 2021 షెడ్యూల్, సిలబస్, స్టడీ మెటీరియల్, ప్రిపరేషన్‌ గైడెన్స్, ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్స్, మాక్‌ టెస్ట్స్, బిట్‌ బ్యాంక్స్, మోడల్‌ పేపర్స్‌... ఇతర తాజా అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.

పరీక్ష ఫీజు..

  • ఇంజనీరింగ్‌: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400, ఇతరులకు రూ.800
  • అగ్రికల్చర్‌ అండ్‌ మెడిసిన్: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400, ఇతరులకు రూ.800
  • ఇంజనీరింగ్‌–అగ్రికల్చర్‌ అండ్‌ మెడిసిన్: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 800, ఇతరులకు 1,600

ఇదీ పరీక్ష షెడ్యూల్‌..

దరఖాస్తుల నోటిఫికేషన్

18.03.2021

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం

20.03.2021

దరఖాస్తుకు చివరి తేదీ

18.05.2021

దరఖాస్తు సవరణ

19.05.2021 – 27.05.2021

రూ.250 అపరాధ రుసుముతో దరఖాస్తు

28.05.2021

రూ.500 అపరాధ రుసుముతో

07.06.2021

రూ.2,500 అపరాధ రుసుముతో

17.06.2021

రూ.5,000 అపరాధ రుసుముతో

28.06.2021


పరీక్ష తేదీలు:

  • అగ్రికల్చర్‌ అండ్‌ మెడిసిన్ స్ట్రీమ్‌ (ఉ.9 నుంచి మ.12 వరకు) 05.07.2021 – 06.07.2021
  • ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ (మ.3 నుంచి సా.6 వరకు) 07.07.2021, 08.07.2021, 09.07.2021
Published date : 08 Mar 2021 03:31PM

Photo Stories