సివిల్ సర్వీసెస్‌కు మరో 89 మంది పేర్లు
Sakshi Education
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్‌లోని వివిధ విభాగాలకు మరో 89 మంది అభ్యర్థుల పేర్లను యూపీఎస్‌సీ సిఫారసు చేసింది. సివిల్ సర్వీసెస్-2019 పరీక్షల ఫలితాలు గత ఏడాది ఆగస్టులో వెల్లడయ్యాయి.
ప్రతిభ ఆధారంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, గ్రూప్ ఏ, బీ సెంట్రల్ సర్వీసుల్లో ఖాళీగా ఉన్న 927 పోస్టులకు గాను 829 మంది అభ్యర్థుల పేర్లను యూపీఎస్‌సీ కేంద్రానికి సిఫారసు చేసింది. నిబంధనలకు లోబడి, ప్రతిభ ఆధారంగా వివిధ విభాగాలకు అవసరమైన మరో 89 మంది పేర్లను తాజాగా యూపీఎస్‌సీ పంపినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం తెలిపింది. వీరిలో జనరల్ కేటగిరీ నుంచి 73 మంది, ఓబీసీ 14 మంది, ఈడబ్ల్యూఎస్ ఒకరు, ఎస్సీ అభ్యర్థి ఒకరు ఉన్నారని పేర్కొంది. ఈ జాబితాను http://www.upsc.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని వివరించింది.
Published date : 05 Jan 2021 04:12PM