సివిల్ సర్వీసెస్–2020 ఇంటర్వ్యూలు వాయిదా
Sakshi Education
న్యూఢిల్లీ: కరోనా విజృంభణ నేపథ్యంలో సివిల్ సర్వీసెస్–2020 ఇంటర్వ్యూలను వాయిదా వేస్తున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సోమవారం ప్రకటించింది.
‘ఇండియన్ ఎకనమిక్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ఏప్రిల్ 20– 23 వరకు), సివిల్ సర్వీసెస్ (ఏప్రిల్ 26– జూన్ 18 వరకు) ఇంటర్వ్యూలను వాయిదా వేస్తున్నాం. వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్, భౌతికదూరం పాటించడం, దేశం నలుమూలల నుంచి అభ్యర్థులు రావాల్సి ఉండటం... వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాయిదా నిర్ణయిం తీసుకున్నాం. అలాగే మే 9వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈవో/ ఏవో) రిక్రూట్‌మెంట్ టెస్టును కూడా వాయిదా వేస్తున్నాం. ఇంటర్వ్యూలు, రిక్రూట్‌మెంట్ టెస్టుకు సంబంధించి ఇంకేదైనా అదనపు సమాచారం ఉంటే ఎప్పటికప్పుడు కమిషన్ వైబ్‌సైట్‌లో పెడతాం’అని యూపీఎస్‌సీ తెలిపింది. సివిల్స్ ఇంటర్వ్యూలను మళ్లీ ఎప్పుడు నిర్వహించినా... కనీసం 15 రోజుల ముందుగా అభ్యర్థులకు తెలియజేస్తామని పేర్కొంది.
Published date : 20 Apr 2021 04:56PM