సింగరేణిలో 651 కొలువులు.. మార్చిలోగా భర్తీ చేస్తాం: సీఎండీ శ్రీధర్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో 651 ఉద్యోగ ఖాళీలను మార్చిలోగా భర్తీ చేస్తామని సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ ప్రకటించారు.
ఉద్యోగ ఖాళీల వివరాలతోపాటు ఇతర అంశాలపై శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. అన్ని పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి అందులో ప్రతిభ చూపిన వారికి నిబంధనల ప్రకారం మార్చిలోగా ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఖాళీగా ఉన్న 651 ఉద్యోగాల్లో నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ (ఎన్‌సీడబ్ల్యూఏ) పరిధిలోని 569 పోస్టులు, మరో 82 అధికార పోస్టులు ఉన్నాయని, ప్రత్యేక నోటిఫికేషన్ల ద్వారా వాటిని భర్తీ చేస్తామన్నారు. సింగరేణిలో కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాల్లో భాగంగా సుమారు 10 వేల మందికిపైగా యువకులు ఉద్యోగాలు పొందారని, వారిలో అనేక మంది ఉన్నత విద్యార్హతలున్నా బదిలీ వర్కర్లు లేదా జనరల్ మజ్దూర్లుగా పనిచేస్తున్నారన్నారు. సింగరేణిలో ఏర్పడే ఖాళీల్లో సంస్థలో పనిచేస్తున్న అర్హులైన వారికి కూడా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సీఎం హామీ మేరకు వివిధ గనులు, విభాగాలు, కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,436 పోస్టులను అంతర్గతంగా అభ్యర్థులను గుర్తించి వారితోనే భర్తీ చేస్తామన్నారు. ఈ మేరకు త్వరలోనే అంతర్గత ఉత్తర్వులు జారీ చేసి దరఖాస్తులు ఆహ్వానించి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.
రాష్ట్ర ఆవిర్భావం నుంచి 13,934 ఉద్యోగాలు..
బొగ్గు, థర్మల్ విద్యుత్ ఉత్పాదనలో కీలకపాత్ర పోషిస్తున్న సింగరేణి 2014లో రాష్ట్ర అవతరణ మొదలుకుని ఇప్పటి వరకు 13,934 ఉద్యోగాలు కల్పించిందని శ్రీధర్ వెల్లడించారు. కారుణ్య నియామక ప్రక్రియ ద్వారా 10,879 మందికి, 45 బహిర్గత నియామక నోటిఫికేషన్ల ద్వారా 3,055 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. వాటితోపాటు 75 అంతర్గత నోటిఫికేషన్ల ద్వారా ఇంటర్నల్ అభ్యర్థులకు 2,501 ఉద్యోగాలు కల్పించామని, తాజా ఇంటర్నల్ రిక్రూట్‌మెంట్ ద్వారా మరో 1,436 పోస్టులను మార్చికల్లా భర్తీ చేస్తామన్నారు. ఇవి కూడా పూర్తయితే ఈ ఏడాది మార్చి నాటికి సింగరేణి సంస్థ తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొత్తగా కల్పించిన ఉద్యోగాల సంఖ్య 18,522 చేరుతుందని సీఎండీ ఎన్. శ్రీధర్ తెలిపారు. సింగరేణి చేపట్టనున్న అన్ని నియామకాలు అభ్యర్థుల ప్రతిభ, రాత పరీక్షలో వారికి వచ్చే మార్కులపైనే ఆధారపడి ఉంటుందని, ఇంటర్వ్యూ ప్రక్రియ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి పైరవీలకు అవకాశం ఉండదని, ఉద్యోగాలు ఇప్పిస్తామనే దళారుల మాటలను నమ్మి ఎవరూ మోసపోవద్దని హెచ్చరించారు.

Published date : 09 Jan 2021 01:08PM