Skip to main content

సింగరేణిలో 372 ఉద్యోగాలకు నోటిఫికేషన్

సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ గురువారం తొలి విడతగా 372 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇందులో 7 కేటగిరీల పోస్టులు ఉన్నాయి. 305 పోస్టులను లోకల్ వారికి, అనగా సింగరేణి విస్తరించి ఉన్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు.

సింగరేణి బొగ్గు గనుల సంస్థ372 పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

అన్ రిజర్వుడ్ కేటగిరీకి సంబంధించిన 67 పోస్టులకు తెలంగాణ జిల్లాలకు చెందిన అభ్యర్థులందరూ అర్హులు. పై ఉద్యోగాలకు సంబంధించిన వయోపరిమితి, విద్యార్హతలు, జీతభత్యాలు, ఫీజు చెల్లింపు మొదలైన వివరాలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వెబ్ సైట్ (www.scclmines.com) లోకి వెళ్లి అక్కడ హోం పేజీలో గల కెరీర్ లింక్‌ను ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. కాగా, అర్హులైన అభ్యర్ధుందరూ ఈ నెల 22వ తేదీ మధ్యా హ్నం 3 గంటల నుంచి ఫిబ్రవరి 4 సాయంత్రం 5 గంటల వరకూ ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుంది.

ఇంటర్వ్యూలు ఉండవు: సీఎండీ శ్రీధర్
ఈ పోస్టుల నియామకాలు కేవలం రాత పరీక్ష ఆధారంగా జరుగుతాయని, ఇంటర్వ్యూలు ఉండవని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. ఎవరైనా ప్రలోభపెడుతున్నట్లు దృష్టికి వస్తే సింగరేణి విజిలెన్స్ శాఖకు తెలియజేయాలని కోరారు.

Published date : 22 Jan 2021 03:09PM

Photo Stories