Skip to main content

సింగరేణిలో 2087 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్‌...

సాక్షి, ఎడ్యుకేషన్‌: తెలంగాణ రాష్ట్రంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌(SCCL) శుభవార్త అందించింది.
త్వరలో దాదాపుగా 2087 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తాజాగా వెల్లడించింది. ఈ 2087 ఉద్యోగాల్లో 651 ఎక్స్‌టర్నల్‌ పోస్టులు, 1436 ఇంటర్నల్‌ పోస్టులు ఉన్నట్లు తెలిపింది. ఎక్స్‌టర్నల్‌ పోస్టుల విభాగంలో దాదాపు 177 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు ఉన్నాయని పేర్కొంది. ఈ జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుకి గ్రాడ్యుయేషన్‌ చేసిన ప్రతి ఒక్కరూ అర్హులే.

సాక్షి ఎడ్యుకేషన్‌ ఆన్‌లైన్‌ కోచింగ్‌...
సింగరేణి సంస్థ త్వరలోనే నోటిఫికేషన్‌ విడదల చేసినప్పటికీ, కోవిడ్‌–19 పరిస్థితుల దృష్ట్యా ఈ ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు... కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వెళ్లి చదువుకొనే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల సౌలభ్యం కోసం సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌(www.sakshieducation.com) ‘‘ఆన్‌లైన్‌ కోచింగ్‌’’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కార్యక్రమంలో భాగంగా ప్రముఖ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల సహకారంతో... తక్కువ ధరలకే జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌ ద్వారా కోచింగ్‌ ఇవ్వడం జరుగుతుంది.
Published date : 13 Feb 2021 02:34PM

Photo Stories