సీఐడీలో 29 కొత్త పోస్టులు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (సీఐడీ)లో 29 కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.
ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(హోం శాఖ) కుమార్ విశ్వజిత్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. సీఐడీకి చెందిన ఏడు ప్రాంతీయ (రీజినల్) కార్యాలయాల్లో వీటిని భర్తీ చేయనున్నారు. 10 జూనియర్ అసిస్టెంట్, 9 జూనియర్ స్టెనో, 10 టైపిస్ట్ పోస్టులను ఏర్పాటు చేశారు.
Published date : 18 Feb 2021 03:59PM