సెప్టెంబర్ 6న టీఎస్ ఎల్‌పీసెట్ 2020 పరీక్ష!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎల్‌పీ సెట్-20 పరీక్షలను వచ్చే నెల 6న నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి(ఎస్‌బీటీఈటీ) ఓ ప్రకటనలో తెలిపింది.
వాస్తవానికి ఈ పరీక్ష జూలై 5న నిర్వహించాల్సి ఉండగా.. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో వాయిదా పడింది. తాజాగా పరీక్ష తేదీని సెప్టెంబర్ 6న నిర్వహించాలని ఎస్‌బీటీఈటీ నిర్ణయించింది. పేపర్-1 ఉదయం 11 గంట ల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రాయాల్సి ఉంటుందని పేర్కొంది.
Published date : 24 Aug 2020 02:34PM