Skip to main content

సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలహాల్ టిక్కెట్లు; బిట్‌బ్యాంక్స్ మీ కోసం

సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 10.56 లక్షల మంది అభ్యర్ధులలో మంగళవారం నాటికి 6.99 లక్షల మంది తమ హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని పరీక్షల నిర్వహణకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఏపీ సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్, ప్రాక్టీస్ టెస్ట్స్, బిట్‌బ్యాంక్స్... ఇతర తాజా సమాచారం కొరకు క్లిక్ చేయండి.

మిగిలిన 3.57 లక్షల మంది తమ హాల్ టిక్కెట్లను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. వెయిటేజీ కోసం 20వ తేదీలోగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. ప్రస్తుతం కాంట్రాక్టు లేదంటే ఔట్‌సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తూ సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారు వెయిటేజీ మార్కుల కోసం తమ శాఖాధిపతుల నుంచి తీసుకున్న ధ్రువీకరణ పత్రాలను ఈ నెల 20వ తేదీలోగా గ్రామ వార్డు సచివాలయ వెబ్ సైట్ అప్‌లోడ్ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Published date : 16 Sep 2020 12:57PM

Photo Stories