రేపే ఏపీ ఎడ్‌సెట్ 2020 పరీక్ష
Sakshi Education
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): ఆంధ్రప్రదేశ్రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు వచ్చే నెల 1వ తేదీన ఎడ్‌సెట్ నిర్వహిస్తున్నట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ ఆచార్య ఆర్.శివప్రసాద్ తెలిపారు.
మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 1వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తామన్నారు. 15,658 మంది దరఖాస్తు చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా 17 నగరాల్లో 50 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులు తమ వెంట హాల్‌టికెట్, గుర్తింపు కార్డును తీసుకురావాలని, విధిగా మాస్క్ ధరించి, శానిటైజర్‌ను వినియోగించాలని సూచించారు.
Published date : 30 Sep 2020 12:50PM