ఫిబ్రవరి 4 నుంచి ఏపీఎంసెట్ మూడో విడత కౌన్సెలింగ్
Sakshi Education
సాక్షి, అమరావతి: ఏపీ ఎంసెట్ మూడో విడత కౌన్సెలింగ్ ఈ నెల 4 నుంచి ప్రారంభం కానుంది.
ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎంసెట్ కన్వీనర్, సాంకేతిక విద్యామండలి ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ మంగళవారం తెలిపారు. ఈనెల 3 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపునకు అవకాశం ఉంది. గురు, శుక్రవారాల్లో ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 7న సీట్లు కేటాయిస్తారు. ఈ నెల 8 నుంచి 11 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీల్లో చేరికలకు అవకాశం ఇస్తున్నారు.
Published date : 03 Feb 2021 05:42PM