ఫిబ్రవరి 26, 27 తేదీల్లో టీఎస్‌సీహెచ్‌ఈ వర్క్‌షాప్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్‌సీహెచ్‌ఈ), తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) సంయుక్తంగా జాతీయ స్థాయి వర్క్‌షాప్ నిర్వహించనున్నాయి.
ఈ నెల 26, 27 తేదీల్లో వర్చువల్ పద్ధతిలో నిర్వహించే ఈ వర్క్‌షాప్‌లో ఆసక్తిగల మేథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ టీచర్లు పాల్గొనవచ్చు. ముందుగా టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకున్నాక వచ్చే లింక్‌ను క్లిక్ చేసి పాల్గొనాల్సి ఉంటుంది. ఎమర్జింగ్ ట్రెండ్‌స ఇన్ డేటా సైన్స్, టీచింగ్ మెథడాలజీ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఇన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ అనే అంశాలపై ఈ వర్క్‌షాప్ సాగనుంది.
Published date : 15 Feb 2021 03:15PM