ప్రొబేషన్‌లోనూ.. మెటర్నిటీ సెలవు
Sakshi Education
సాక్షి, అమరావతి: ప్రొబేషనరీ సమయంలోనూ అర్హులైన గ్రామ, వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులు 180 రోజుల మెటర్నిటీ సెలవులను ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం అనుమతి తెలిపింది.
ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా ఉండగా, గ్రామ, వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులకు మాతృత్వ సెలవులు మంజూరు చేసినందుకు సీఎం వైఎస్ జగన్‌కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కృతజ్ఞత తెలిపింది.
Published date : 26 Sep 2020 12:39PM