పోటీ పరీక్షలకు ‘టీ–శాట్’ మాక్ టెస్ట్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల సాధనకు రాసే పోటీ పరీక్షల్లో యువతకు తోడ్పాటును అందించిన ‘టీ– శాట్’నెట్‌వర్క్ చానళ్ల ద్వారా ఉద్యోగార్థులకు ఉచితంగా ‘మాక్ టెస్ట్’లు నిర్వహించాలని టీ–శాట్ నిర్ణయించింది.
ఈ మేరకు టీ–శాట్ సీఈవో ఆర్.శైలేశ్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్, కంబై¯Œన్డ్ సెకండరీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోటీ పరీక్షలు రాస్తున్న ఉద్యోగార్థులు మాక్ టెస్టుల ద్వారా తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకునే అవకాశం టీ–శాట్ ద్వారా లభిస్తుందన్నారు. ఈ ఏడాది మే నెలలో ఎస్‌ఎస్‌సీ నిర్వహించే సీజీఎల్, సీహెచ్‌ఎల్ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను ప్రోత్సహించేందుకు టీ–శాట్ నిర్వహించే మాక్ టెస్ట్ ప్రీ ఫైనల్‌గా ఉపయోగపడుతుందన్నారు.
Published date : 11 Mar 2021 03:51PM