నేటి నుంచి టీఎస్ పీజీఈసెట్- 2020 రెండో దశ కౌన్సెలింగ్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం పీజీఈసెట్ రెండో దశ కౌన్సెలింగ్‌ను నేటి నుంచి నిర్వహించనున్నట్లు ప్రవేశాల కమిటీ తెలిపింది.
విద్యార్థులు గురువారం నుంచి డిసెంబర్23వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజస్ట్రేషన్ చేసుకొని, సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలని సూచించింది. డిసెంబర్ 26, 27 తేదీల్లో వెబ్ ఆప్షన్లు, 30వ తేదీన సీట్లను కేటాయింపు చేస్తామని వెల్లడించింది. సీట్లు పొందిన వారు 31 నుంచి జనవరి 6వ తేదీలోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని తెలిపింది. రెండో దశలో 4,413 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది.
Published date : 17 Dec 2020 04:35PM